top of page
Shiva YT

ఏప్రిల్ 28న జియా ఖాన్ సూసైడ్ కేసులో తుది తీర్పు...

బాలీవుడ్‌లో సంచలనం రేపిన హీరోయిన్ జియా ఖాన్ సూసైడ్ కేసు విచారణ తుది దశకు చేరుకొన్నది.

బాలీవుడ్‌లో సంచలనం రేపిన హీరోయిన్ జియా ఖాన్ సూసైడ్ కేసు విచారణ తుది దశకు చేరుకొన్నది. దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన జియా ఖాన్ అనుమానాస్పద మృతిపై సీబీఐ కోర్టు తుది తీర్పును రిజర్వు చేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సూరజ్ పంచోలికి శిక్ష పడుతుందా? అతడిని నిర్దోషిగా పేర్కొంటారా? అనే ప్రశ్నలు మీడియాలోను, సోషల్ మీడియాలోను చర్చనీయాంశమయ్యాయి. ఈ కేసు వివరాల్లోకి వెళితే.రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన నిశ్శబ్ద్ చిత్రం ద్వారా భారతీయ సినిమా పరిశ్రమలోకి జియా ఖాన్ అడుగుపెట్టింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి తన కెరీర్‌ను చక్కదిద్దుకొనే ప్రయత్నం చేసింది. ఆ క్రమంలోనే సూరజ్ పంచోలితో డేటింగ్ చేసిందనే వార్తలు వచ్చాయి. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు మీడియాలో వినిపించాయి. కానీ ఎవరూ ఊహించని విధంగా సూసైడ్ చేసుకోవడం సంచలనం రేపింది.జియా ఖాన్ ముంబైలోని జుహులోని తన ఫ్లాట్‌లో 2013 సంవత్సరం జూన్ 3వ తేదీన విగత జీవిగా కనిపించింది. ప్రాథమిక విచారణ తర్వాత జియా ఖాన్ మరణాన్ని సూసైడ్‌ కాదని కొట్టి పడేశారు. సూసైడ్ లెటర్ ఆధారంగా హీరో సూరజ్ పంచోలిని అరెస్ట్ చేశారు. జియా ఖాన్ రాసిన ఆరు పేజిల సూసైడ్ లెటర్‌ ఆధారంగా ఆమె హత్యకు ప్రేరేపించారనే అభియోగాలపై కేసు నమోదు చేశారు.

దేశవ్యాప్తంగా సంచలనం కావడం, ఆమె మరణం కేసులో దర్యాప్తుపై అనేక అనుమానాలు వచ్చాయి. ముంబై సెషన్స్ కోర్టు మా పరిధిలోకి రాదని చేతులెత్తేయడంతో జియా ఖాన్ మృతి కేసును సీబీఐకి అప్పగించారు. ఈ కేసులో కీలక సాక్షిగా జియా ఖాన్ తల్లి రబీనా ఖాన్‌ను సీబీఐ పరిగణించింది. అయితే తన కూతురుది సూసైడ్ కాదు.. హత్య అంటూ ఆమె మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేసింది.





bottom of page