top of page
MediaFx

చరిత్ర సృష్టించిన చాహల్.. ఈ ఘనత దక్కించుకున్న తొలి బౌలర్..


ఐపీఎల్ చరిత్రలో 200 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా రాజస్థాన్ స్పిన్నర్, భారత స్టార్ యజువేంద్ర చాహల్ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‍లో 8వ ఓవర్ రెండో బంతికి ముంబై బ్యాటర్ మహమ్మద్ నబీని ఔట్ చేశాడు చాహల్. తన బౌలింగ్‍లో నబీ ఇచ్చిన క్యాచ్‍ను తానే పట్టాడు. ఐపీఎల్‍లో 200వ వికెట్ దక్కించుకున్నాడు చాహల్. దీంతో ఐపీఎల్ హిస్టరీలో 200 వికెట్లు తీసిన తొలి బౌలర్ అతడు ఘనత దక్కించుకున్నాడు. 200 వికెట్ల మైలురాయిని చేరాక మైదానంపై మోకాళ్లపై కూర్చొని ఆకాశాన్ని చూస్తూ సంబరాలు చేసుకున్నాడు చాహల్. ఎమోషనల్‍గా సెలెబ్రేట్ చేసుకున్నాడు.ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్ల జాబితాలో యజువేంద్ర చాహల్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. చాహల్ తర్వాతి స్థానంలో డ్వైన్ బ్రావో (183 వికెట్లు రిటైర్డ్), పియూష్ చావ్లా (181 వికెట్లు), భువనేశ్వర్ కుమార్ (174 వికెట్లు) ఉన్నారు. ఇప్పటి వరకు 153 ఐపీఎల్ మ్యాచ్‍ల్లోనే 200 వికెట్లను చాహల్ కైవసం చేసుకున్నాడు.

Comments


bottom of page