top of page

బాలకృష్ణకు బర్త్ డే విషెస్ చెప్పిన క్రికెటర్ యువరాజ్ సింగ్..

"హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు నందమూరి బాలకృష్ణ సార్. క్యాన్సర్ అండ్ రీసెర్చ్ సెంటర్ ద్వారా సమాజానికి అంకిత భావంతో మీరు చేస్తున్న సేవలు స్పూర్తిదాయకం. మీకు ఈ సంవత్సరం అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను" అంటూ ట్వీట్ చేశారు.


నందమూరి నటసింహం బాలకృష్ణ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. నారా లోకేష్ ఇప్పటికే బాలకృష్ణకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపగా.. ఇప్పుడు మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ట్విట్టర్ వేదికగా బాలయ్యకు విషెస్ తెలిపారు. “హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు నందమూరి బాలకృష్ణ సార్. క్యాన్సర్ అండ్ రీసెర్చ్ సెంటర్ ద్వారా సమాజానికి అంకిత భావంతో మీరు చేస్తున్న సేవలు స్పూర్తిదాయకం. మీకు ఈ సంవత్సరం అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను” అంటూ ట్వీట్ చేశారు. అలాగే గతంలో బాలయ్యతో దిగిన ఫోటోను షేర్ చేశారు. ఇదిలా ఉంటే బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‏స్టిట్యూట్ చైర్మన్ గా ఉంటూ బాలకృష్ణ అనేక సేవలు అందిస్తూ ముందుకు నడిపిస్తున్నారు. ఇక క్రికెటర్ యువరాజ్ సింగ్ 2011లో క్యాన్సర్ బారిన పడి ట్రీట్మెంట్ తీసుకుని పూర్తి ఆరోగ్యంతో కోలుకున్నారు. అప్పటినుంచి ఓ ఫౌండేషన్ స్టార్ట్ చేసి క్యాన్సర్ బాధితులకు సాయం చేస్తున్నారు. అదే సమయంలో యూవీ బసవతారకం ఆసుపత్రికి అవసరం సమయంలో సాయం చేస్తున్నారు. ఇలా వీరిద్దరి మంచి సన్నిహిత్యం ఏర్పడింది.




コメント


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page