వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇంట్లో పెళ్లిసందడి మొదలైంది. షర్మిల కుమారుడు రాజారెడ్డి త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఈ మధ్య కాలంలో షర్మిల తనయుడు రాజారెడ్డి ప్రేమలో పడ్డట్లు మీడియా, సోషల్ మీడియాలో కోడైకూసింది.
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇంట్లో పెళ్లిసందడి మొదలైంది. షర్మిల కుమారుడు రాజారెడ్డి త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఈ మధ్య కాలంలో షర్మిల తనయుడు రాజారెడ్డి ప్రేమలో పడ్డట్లు మీడియా, సోషల్ మీడియాలో కోడైకూసింది. దీనిపై తాజాగా వైఎస్ షర్మిల స్పందించారు. ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేసేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్లు ప్రకటించారు. నూతన సంవత్సరం సందర్బంగా ప్రజలందరికీ న్యూ ఇయర్ విషెస్ చెప్తూ తన ఇంట జరిగే శుభకార్యాన్ని ప్రజలందరితో పంచుకున్నారు. ఇప్పటికే వైఎస్ రాజారెడ్డి వివాహానికి సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. తన కుమారుడు వైఎస్ రాజా రెడ్డి అట్లూరి ప్రియాతో 2024 జనవరి 18న నిశ్చితార్థం వేడుక జరుగనున్నట్లు వెల్లడించారు. అలాగే 2024 ఫిబ్రవరి 17న వివాహం జరగనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని మీతో పంచుకోవడం ఆనందంగా ఉందంటూ ఎక్స్ వేదికపై పోస్ట్ చేశారు. జనవరి 2న కుటుంబ సమేతంగా కాబోయే వధూవరులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్‌ని సందర్శిస్తామన్నారు. తొలి ఆహ్వాన పత్రిక ఘాట్ వద్ద ఉంచి, నాన్న ఆశీస్సులు తీసుకోనున్నట్లు వివరించారు.
ఇక వైఎస్ రాజా రెడ్డి విషయానికొస్తే.. యూఎస్‌లో ఉంటున్న రాజారెడ్డి, ప్రియా అట్లూరి అనే అమ్మాయిని ప్రేమించారు. గతంలో వీరిద్దరు కలిసున్న ఫోటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అంతే కాకుండా వైఎస్ విజయమ్మ ప్రియా అట్లూరికి చీర పెట్టిన ఫొటో బయటకు రావడంతో వీళ్ల పెళ్లి వార్తలకు బలం చేకూర్చినట్లైంది. ఆ తరువాత ఇరు కుటుంబ సభ్యులు కూర్చొని ఎప్పుడు పెళ్లి చేయాలనే దానిపై ఒక స్పష్టత వచ్చాక నిశ్చితార్ధంతో పాటు పెళ్లి తేదీలను ప్రకటించారు షర్మిల. దీంతో రాజారెడ్డి, ప్రియా అట్లూరి మూడు ముళ్ల బంధంతో ఒక్కటవ్వనున్నారు. రాజారెడ్డి వివాహం ఫిబ్రవరి 17న జరగనున్నట్టు తెలిసింది. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ఉమేద్ ప్యాలెస్ వీరిద్దరి పెళ్లికి వేదిక కానున్నట్లు సమాచారం. జనవరి 18న హైదరాబాద్‌లో నిశ్చితార్థం ఉంటుందని తెలుస్తోంది. వివాహ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే బంధువులకు, ఆత్మీయులకు, స్నేహితులకు ఆహ్వానాలు కూడా పంపుతున్నట్లు సమాచారం.
ఇక ఉన్నత చదువుల కోసం యూఎస్ వెళ్లిన రాజారెడ్డి అక్కడ ప్రియా అట్లూరితో పరిచయం ఏర్పర్చుకున్నారు. కొంత కాలానికి వీరి పరిచయం ప్రేమగా మారింది. ఇక ప్రియా అట్లూరి కూడా యూఎస్‌లోనే ఉన్నత చదువులు చదివి ఉద్యోగం చేస్తున్నారు. ఈమే కూడా మంచి పేరున్న కుటుంబానికి చెందిన అమ్మాయే. ప్రియా తండ్రి అట్లూరి శ్రీనివాస్ అమెరికాలో స్థిరపడ్డారు. అట్లూరి శ్రీనివాస్ కమ్మ సామాజిక వర్గం అయినప్పటికీ, ఎప్పుడో క్రిస్టియన్ మతాన్ని స్వీకరించారని తెలుస్తోంది. ఇన్నాళ్లు వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్‌తో ఉన్న స్నేహం ఇప్పుడు బంధుత్వంగా మారబోతుందని ప్రచారం సాగుతోంది. అట్లూరి శ్రీనివాస్ చంద్రబాబుకు కూడా సుపరిచితులు. ఈ కుటుంబానికి చంద్రబాబుతో మంచి సాన్నిహిత్యం ఉన్నట్లు సమాచారం.💑👪