top of page
MediaFx

వేణుస్వామి పైనే భారం వేసిన వైసీపీ🌟

ఏపీలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.నేతల జాతకాలు ఈవీఎంలలో నిక్షిప్తంగా భద్రపరచడం జరిగింది.గతంలో ఎప్పుడు లేన్నంతగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమ సొంత గ్రామాల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపించడంతో ఈసారి ఓటింగ్ శాతం పెరిగింది. ఏపీలో దాదాపు 81 శాతం ఓటింగ్ జరిగినట్టు అంచనా వేస్తున్నారు. ఇక గెలుపుపై ఇరు పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ఇది ఎక్కువే. గత ఎన్నికల్లో 79.8 శాతం పోలింగ్ నమోదైంది. ఈసారి ఎన్నికల్లో 81.86 శాతం నమోదు కావడంతో ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది రాజకీయ నాయకులు ఓ అంచనా వేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఏపీలో ఎన్నికలు ముగియడంతో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో అని అందరూ అతృతుగా ఎదురు చూస్తున్నారు. 

తిరిగి వైసీపీ గెలుస్తుందని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తుంటే..కూటమే విజయం సాధిస్తుందని మూడు పార్టీలకు చెందిన నేతలు గట్టి నమ్మకంగా చెబుతున్నారు. ఆ సమయంలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి తెర మీదకు వచ్చారు. ఆయన గతంలో మాట్లాడుతూ.. ఏపీలో మరోసారి సీఎం జగనే అని తేల్చి చెప్పిన సంగతి అందరికి తెలిసిందే. ఏపీలో మరోసారి సీఎం జగనే అంటూ పలు సందర్భాల్లో వాఖ్యానించిన వేణు స్వామి.. వైసీపీ ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందో కూడా తెలిపారు. ఏపీలో జగన్ మరోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారని వేణు స్వామి కుండబద్దలు కొట్టేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్ 135 సీట్లలో విజయం సాధించి సీఎం అవుతారని.. అంతేకాకుండా 2029 ఎన్నికల్లో కూడా గెలిచి జగన్ హ్యాట్రిక్ సీఎంగా రికార్డు సృష్టిస్తారని వేణు స్వామి తెలిపారు. భవిష్యత్తులో టీడీపీ కనుమరుగు అవుతుందని వేణు స్వామి జోస్యం చెప్పారు.దీంతో వైసీపీ నేతలు వేణు స్వామి మీదనే భారం వేశారు. 


bottom of page