top of page
MediaFx

విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికపై వైఎస్ జగన్‌ ఫోకస్‌..


విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో…తనకు ఉన్న బలం దృష్ట్యా పట్టు నిలుపుకోవడానికి, సీటు గెలవడానికి వైసీపీ సకల ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగా ఎమ్మెల్సీ ఎన్నికపై వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ దృష్టి సారించారు. దీనిలో భాగంగా ఇప్పటికే ఉమ్మడి విశాఖలో ఐదు నియోజకవర్గాలకు చెందిన జడ్పీటీసీ, ఎంపీటీసీలతో జగన్‌ భేటీ అయ్యారు. మరో రెండు రోజుల పాటు మిగిలిన నియోజకవర్గాల నేతలతో ఆయన సమావేశం కానున్నారు. ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో భేటీ కారణంగా ఇతర నాయకులు జగన్‌ను కలిసేందుకు అవకాశం లేదని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది. అధినేతను కలిసేందుకు ఇతర నేతలు, కార్యకర్తలు, సందర్శకులు తాడేపల్లికి రావొద్దని పార్టీ ఆఫీసు వర్గాలు సూచించాయి. వాయిస్‌: ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నామినేషన్‌ దాఖలు చేశారు. భార్య ఝాన్సీతోపాటు, పార్టీ ముఖ్యనేతలు వెంట రాగా ఆయన విశాఖ కలెక్టరేట్‌కు వెళ్లి నామినేషన్ వేశారు. మాజీ మంత్రులు కన్నబాబు, అమర్నాథ్, ఎమ్మెల్సీ నర్తు రామారావు, చిన్న శీను కూడా బొత్స నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం వైఎస్సార్‌సీపీదేనని ధీమా వ్యక్తం చేశారు బొత్స.

bottom of page