దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు తీవ్ర రూపం దాల్చాయి. రుతుపవనాల ప్రభావంతో అన్ని రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కర్ణాటకలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.
దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు తీవ్ర రూపం దాల్చాయి. రుతుపవనాల ప్రభావంతో అన్ని రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కర్ణాటకలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న, ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వర్షంతో చెరువులు, వాగులు, నదిపరివాహక ప్రాంతాల్లో వరద ఉప్పొంగి ప్రవహిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం బైందూరు తాలూకాలోని కొల్లూరు సమీపంలోని అరశినగుండి జలపాతాన్ని వీక్షిస్తున్న ఓ యువకుడు ప్రమాదవశాత్తు నీటిలో పడి కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, కొల్లూరు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మృతుడు భద్రావతికి చెందిన శరత్‌కుమార్‌గా గుర్తించామని, ఘటన జరిగినప్పుడు అతడు బండరాయి అంచున నిలబడి ఉన్నాడని తెలిపారు.కాగా, యువకుడు బండరాయిపై నిలబడి నీటి ప్రవహ దృశ్యాలను చూస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలు యువకుడు అప్పటి వరకు బండరాయిపై నిలబడి ఉన్నాడు. ఉప్పొంగి ప్రవహిస్తున్న నీటిని చూస్తూ ఆనందపడుతున్నాడు. అలా చూస్తుండగానే అనుకోని ఘటన చోటు చేసుకుంది. ఊహించని విధంగా అతడు ఒక్కసారిగా జారి నీళ్లలో పడి కొట్టుకుపోయాడు. 😔