చివరిగా వచ్చిన కార్తికేయ 2, 18 పేజెస్ సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఇక ఇప్పుడు స్పై అనే యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. జూన్ 29న విడుదలైన ఈ మూవీ మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది.
కుర్ర హీరో నిఖిల్ హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ హిట్స్ అందుకుంటున్నాడు నిఖిల్. నిఖిల్ సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ ఉంటుంది. ఆయన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. చివరిగా వచ్చిన కార్తికేయ 2, 18 పేజెస్ సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఇక ఇప్పుడు స్పై అనే యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. జూన్ 29న విడుదలైన ఈ మూవీ మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ హైలైట్ గా ఉన్నాయ్ అంటున్నారు చూసిన ప్రేక్షకులు. ఈ మూవీ రిలీజ్ కు ముందే బిజినెస్ బాగానే జరిగింది.అలాగే బుకింగ్స్ లోనూ ఈ మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. అలాగే కలెక్షన్స్ కూడా బాగానే రాబట్టింది. అదే విధంగా ఈ మూవీ డిజిటల్ రైట్స్ కూడా భారీ ధరకే అమ్ముడయ్యాయని తెలుస్తోంది. అలాగే ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ గురించిన ఓ వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో వైరల్ గా మారింది. స్పై సినిమాను వీలైనంత త్వరగా ఓటీటీలో రిలీజ్ చేయాలనీ చూస్తున్నారట.
ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో స్పై మూవీ డిజిటల్ రైట్స్ ను దక్కించుకుందని తెలుస్తోంది. జులై చివరిలో ఈ మూవీని స్ట్రీమింగ్ ను ఉంచనున్నారట. గ్యారీ బీహెచ్ డైరెక్టర్‌గా పరిచయమైన ఈ సినిమాలో రానా గెస్ట్ రోల్ లో కనిపించి అలరించారు.