top of page
Suresh D

హీరోయిన్‏తో యంగ్ హీరో నిశ్చితార్థం.. ✨💞

కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ నిశ్చితార్థం ఇరు కుటుంబసభ్యులు, స్నేహితులు మధ్య గ్రాండ్ గా జరిగింది. మార్చి 13న సాయంత్రం వీరిద్దరు ఉంగరాలు మార్చుకున్నట్లు తెలుస్తోంది.

కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ నిశ్చితార్థం ఇరు కుటుంబసభ్యులు, స్నేహితులు మధ్య గ్రాండ్ గా జరిగింది. మార్చి 13న సాయంత్రం వీరిద్దరు ఉంగరాలు మార్చుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే వీరి వివాహం జరగనుంది. నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. ఈ జంటకు సినీ సెలబ్రెటీస్, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఐదేళ్ల ప్రేమాయణం తర్వాత వీరి ప్రేమ పెళ్లి వరకు చేరింది. ఆగస్టులో వీరి వివాహం జరగనుందని తెలుస్తోంది.2019లో రాజావారు రాణిగారు సినిమా విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. ఆ తర్వాత వచ్చిన ఎస్ఆర్ కళ్యాణ మండపం సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాతో కిరణ్ కు మంచి క్రేజ్ వచ్చింది. కానీ ఆ తర్వాత అతడు నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అంతగా కనెక్ట్ కావడం లేదు. వినరో భాగ్యము విష్ణుకథ, మీటర్, రూల్స్ రంజన్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యాయి. దీంతో తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై మరింత శ్రద్ద పెట్టారు.✨

bottom of page