top of page
MediaFx

అందరికీ రాజమౌళి, త్రివిక్రమ్, సుకుమార్ కావాలంటే ఎలా?

🎬 అందరికీ రాజమౌళి, త్రివిక్రమ్, సుకుమార్ కావాలంటే ఎలా? అలా కుదరదు కదా! పైగా వాళ్లు ఏళ్ళకేళ్లు ఒక్కో సినిమాకు తీసుకుంటారు. అందుకే మన హీరోలు ఇప్పుడు కుర్ర దర్శకులతోనే సర్దుకుంటున్నారు. ఈరోజు మన ఎక్స్‌క్లూజివ్ స్టోరీ కుర్ర దర్శకుల గురించే. రాజమౌళి, త్రివిక్రమ్, సుకుమార్ - వీళ్లంతా పేరు మోస్తున్న దర్శకులే కానీ క్రేజ్‌లో హీరోలతో సమానం. కొరటాల, బోయపాటి శ్రీను, వంశీ పైడిపల్లి లాంటి దర్శకులు కూడా తమదైన మార్క్‌తో ముందుకెళ్తున్నారు. అయితే వీళ్లంతా ఒక్కో సినిమాకు ఏళ్ళకేళ్లు టైమ్ తీసుకుంటారు. దీన్నే సుజీత్, వశిష్ట లాంటి కుర్ర దర్శకులు యూజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు టాలీవుడ్‌లో యంగ్ బ్యాచ్‌దే హవా. స్టార్ హీరోలు కూడా వాళ్లే కావాలంటున్నారు. మహేష్, అల్లు అర్జున్ లాంటి హీరోలే ఎక్కువగా రాజమౌళి, త్రివిక్రమ్, సుకుమార్ అంటున్నారు కానీ రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్.. కుర్రాళ్ల వైపే వచ్చేసారు. గేమ్ ఛేంజర్ చేస్తూనే బుచ్చిబాబుకు ఛాన్సిచ్చారు చరణ్. ఎన్టీఆర్ కూడా దేవర పూర్తయ్యాక ప్రశాంత్ నీల్ వైపు వెళ్తున్నారు. రెండు సినిమాల అనుభవం ఉన్న నాగ్ అశ్విన్, ప్రభాస్‌తో కల్కి తీస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా కూడా ప్రభాస్‌తో స్పిరిట్ సినిమా చేయబోతున్నారు. ఈయన అనుభవం కూడా రెండు సినిమాలే. విజయ్ దేవరకొండతో గౌతమ్ తిన్ననూరి, రాహుల్ సంక్రీత్యన్, రవికిరణ్ కోలా లాంటి కుర్ర దర్శకులే పని చేస్తున్నారు.ఓజితో ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తున్న సుజీత్ అనుభవం రెండు సినిమాలే, వయసు 30 మాత్రమే. అలాగే హనుమాన్‌తో ఇండియాను తనవైపు తిప్పుకున్న ప్రశాంత్ వర్మ, నెక్ట్స్ రణ్‌వీర్ సింగ్‌తో పని చేస్తున్నారు. చిరంజీవి విశ్వంభర దర్శకుడు వశిష్టకు ఒక్క సినిమా అనుభవమే ఉంది. అలాగే వెంకీ అట్లూరి, శ్రీకాంత్ ఓదెల, చందూ మొండేటి లాంటి కుర్ర దర్శకులు కూడా కుమ్మేస్తున్నారు.

bottom of page