top of page

కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్..ఒక్కసారి చార్జ్ చేస్తే 300 కి.మి వెళ్లొచ్చు! 🛵💨🔌

టీవీఎస్ మోటార్స్ అదరగొడుతోంది. ఇప్పటికే ఎలక్ట్రిక్ టూవీలర్ల విభాగంలో దుమ్మురేపుతోంది. టీవీఎస్ ఐక్యూబ్ మోడల్‌తో ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తోంది.

టాప్ 3 ఎలక్ట్రిక్ స్కూటర్ (EV) తయారీ కంపెనీల్లో ఒకటిగా కొనసాగుతోంది. ఇప్పుడు టీవీఎస్ కంపెనీ తన మార్కెట్‌ను మరింత విస్తరించుకోవాలని భావిస్తోంది. ఎలక్ట్రిక్ టూవీలర్ (Electric Vehicles ) విభాగంలో అధిక మార్కెట్‌ను హస్తగతం చేసుకోవడం కోసం మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్‌లోకి తీసుకువచ్చేందుకు సిద్ధం అవుతోంది. 🛵💼🌍 టీవీఎస్ కంపెనీ త్వరలోనే కొత్త ఇ-స్కూటర్ మార్కెట్‌లోకి తీసుకురావొచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి. కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ పేరు టీవీఎస్ క్రెయాన్.ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్..ఒక్కసారి చార్జ్ చేస్తే 300 కి.మి వరకు వెళ్ళొచ్చాoట. 2023 ఆగస్ట్ నెలలో కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్‌లోకి తీసుకురావొచ్చనే అంచనాలు ఉన్నాయి. అంతేకాకుండా కంపెనీ ఈ కొత్త మోడల్‌ను దుబాయ్‌లో లాంచ్ చేయొచ్చని తెలుస్తోంది. ఇది స్పోర్టీ లుక్‌తో అదరగొడుతోంది.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page