top of page

🎂 కేక్ తినేశానంటూ ఇన్ స్టాలో ఫొటో పెట్టిన అనుష్క.. 📸

🍰 నా కేక్ కూడా నువ్వే తిన్నావంటూ కోహ్లీ కామెంట్ అలిగి కూర్చున్నావు కాబట్టే మొత్తం నేనే తినేశానని అనుష్క ఫన్నీ రిప్లై 😄

📱 సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పోస్టు సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల జోడీకి ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు.. ఈ జంట కలిసి కనిపిస్తే పండగ చేసుకునే అభిమానులు ఉన్నారనడంలో ఎంతమాత్రమూ అతిశయోక్తి లేదు. వారు చేసే ట్వీట్లు, ఇన్ స్టా పోస్టులను తోటి అభిమానులతో పంచుకుంటూ సంతోషిస్తుంటారు. తాజాగా అనుష్క తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఓ ఫొటోపై కోహ్లీ ఓ ఫన్నీ కామెంట్ పెట్టగా.. 😂 అనుష్క మరింత ఫన్నీగా జవాబిచ్చింది. ఈ పోస్టు కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 😆 ఓ కంపెనీ ప్రచారంలో భాగంగా కేక్ అంటిన చేతులు, అద్భుతంగా ఉందనే ఎక్స్ ప్రెషన్స్ తో అనుష్క ఓ ఫొటో షేర్ చేసింది. 📸 ఇప్పుడే కేక్ తిన్నాననే అర్థం వచ్చేలా ఉన్న ఆ ఫొటోకు కోహ్లీ రియాక్ట్ అయ్యాడు. నా కేక్ కూడా నువ్వే తినేశావంటూ అనుష్కపై ఆరోపణలు చేశాడు. దీనికి జవాబుగా.. ‘నువ్వే అలిగి కూర్చున్నావు నేనేం చేసేది.. అందుకే కేక్ మొత్తం తినేశా’ అంటూ అనుష్క కామెంట్ పెట్టింది. కాగా, ఈ జంట ఇటీవల వినాయక చవితి సంబరాల్లో పాల్గొన్న ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 📷


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page