top of page

🌟 యశ్ అభిమానులకు సూపర్ న్యూస్ ‘KGF3' విడుదల ఎప్పుడో చెప్పిన హోంబలే ఫిల్మ్స్.🎬

ప్రశాంత్‌ నీల్‌- యశ్‌ కాంబోలో వచ్చిన ‘KGF’ సిరీస్‌ చిత్రాలు సంచలన విజయాలను అందుకున్నాయి. అద్భుతమైన ప్రేక్షకాదరణతో థియేటర్లు కిటకిటలాడాయి. బాక్సాపీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిసింది. యశ్, ప్రశాంత్ నీల్ కాంబో అంటేనే ఓ బ్రాండ్ గా మారిపోయింది.

ప్రశాంత్‌ నీల్‌- యశ్‌ కాంబోలో వచ్చిన ‘KGF’ సిరీస్‌ చిత్రాలు సంచలన విజయాలను అందుకున్నాయి. అద్భుతమైన ప్రేక్షకాదరణతో థియేటర్లు కిటకిటలాడాయి. బాక్సాపీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిసింది. యశ్, ప్రశాంత్ నీల్ కాంబో అంటేనే ఓ బ్రాండ్ గా మారిపోయింది. ఇప్పటి వరకు వచ్చిన రెండు భాగాలు అద్భుతంగా ప్రేక్షకులను అలరించడంతో, మూడో భాగం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ‘KGF3' గురించి చిత్ర నిర్మాణ సంస్థ కీలక విషయాలు వెల్లడించింది.

తాజాగా హోంబలే ఫిల్మ్స్‌ కు చెందిన అధికార ప్రతినిధి ‘KGF3'కి సంబంధించి అదిరిపోయే అప్ డేట్స్ ఇచ్చారు. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘KGF3' మూవీ 2025లో విడుదల కాబోతున్నట్లు వెల్లడించారు. ఈ సినిమా నిర్మాణ పనులు 2023లోనే ప్రారంభమవుతాయని ప్రకటించారు. డిసెంబర్ 21 నాటికి ‘KGF’ విడుదలైన ఐదేండ్లు అవుతుంది. ఈ సందర్భంగా ‘KGF3'కి సంబంధించిన పూర్తి వివరాలను హోమ్‌బలే ఫిల్మ్స్ అధికారికంగా ప్రకటిస్తుందని ఆయన తెలిపారు. ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు​ 2024లో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. 2025 కల్లా ఈ చిత్రం థియేటర్లలో విడుదల అయ్యే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే ‘KGF3'కి సంబంధించి దర్శకుడు, నిర్మాతలు, హీరో నడుమ చర్చలు జరిగినట్లు తెలిపారు. కథ విషయంలో ఓ క్లారిటీ వచ్చినట్లు వివరించారు.🎉🎥

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page