top of page
Suresh D

వరల్డ్ లో హ్యాప్పీస్ట్ దేశం అదే..వరుసగా ఏడోసారి ✨

వరల్డ్ హ్యాపీనెస్ 2024 రిపోర్టు(World Happiness Report 2024)లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ జాబితాలో ఫిన్‌లాండ్(finland) వరుసగా ఏడవ సంవత్సరం ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా ఎంపికైంది. ఈ ఇండెక్స్‌లో గతేడాది మాదిరిగానే భారత్(bharat) 126వ స్థానంలోనే నిలిచింది. UN ప్రాయోజిత వార్షిక నివేదిక ప్రకారం 146 దేశాల్లో ఇండియా 126వ స్థానంలో ఉందంటే మనం సంతోష జాబితాలో చాలా వెనుకబడి ఉన్నామని స్పష్టంగా తెలుస్తోంది. ఈ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్‌లో ఆప్గానిస్తాన్ మరోసారి అట్టడుగు స్థానంలో నిలిచింది.

వరల్డ్ హ్యాపీనెస్ 2024 నివేదికలో టాప్ 10 దేశాలు

1. ఫిన్లాండ్

2. డెన్మార్క్

3. ఐస్లాండ్

4. స్వీడన్

5. ఇజ్రాయెల్

6. నెదర్లాండ్స్

7. నార్వే

8. లక్సెంబర్గ్

9. స్విట్జర్లాండ్

10. ఆస్ట్రేలియా 

ఆసక్తికరమైన విషయమేమిటంటే టాప్ హ్యాపీనెస్ ర్యాంకింగ్స్‌లో ప్రపంచంలోని పెద్ద దేశాలు లేకపోవడాన్ని నివేదిక ప్రత్యేకంగా గుర్తు చేసింది. మొదటి 10 స్థానాల్లో అమెరికా(america), జర్మనీ, కెనడా, UK వంటి 30 మిలియన్లకు మించిన దేశాలు మొదటి 20 స్థానాల్లో లేవని తెలిపింది. గణనీయమైన జనాభా ఉన్న ఈ దేశాలు సంతోషకరమైన స్థాయిలో దిగజారుతున్నాయని వెల్లడించింది. ఈ క్రమంలో ఈ జాబితాలో యునైటెడ్ స్టేట్స్, జర్మనీలు వరుసగా 23, 24వ స్థానాల్లో నిలిచాయి.✨

bottom of page