top of page
Suresh D

సస్పెన్స్ వీడింది.. ప్రపంచ కప్‌కు భారత జట్టు..🏆 🤝

ప్రపంచ కప్ 2023 కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. రోహిత్ శర్మ సారథ్యంలో 15 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ఎంపిక చేసింది. హార్థిక్ పాండ్యా వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఆసియా కప్‌కు ఎంపిక చేసిన టీమ్‌నే ఫైనలైజ్ చేశారు.

ప్రపంచ కప్ 2023 కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. రోహిత్ శర్మ సారథ్యంలో 15 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ఎంపిక చేసింది. హార్థిక్ పాండ్యా వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఆసియా కప్‌కు ఎంపిక చేసిన టీమ్‌నే ఫైనలైజ్ చేశారు. అందరూ ఊహించినట్లే సంజూ శాంసన్‌కు నిరాశ ఎదురైంది. ఆసియాకప్‌కు ఎంపికైన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ, గాయం తరువాత రీఎంట్రీ ఇచ్చిన ప్రసిద్ద్ కృష్టలను బీసీసీఐ పక్కనబెట్టింది. యుజ్వేంద్ర చాహల్‌కు కూడా పరిగణలోకి తీసుకోలేదు. ఏకైక స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ ఎంపికయ్యాడు. నలుగురు ఆల్‌రౌండర్లు, ముగ్గురు పేసర్లకు జట్టులో స్థానం కల్పించారు.

రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, అక్షర్ పటేల్. ప్రస్తుతం ప్రపంచకప్ జట్టును ప్రకటించినా.. సెప్టెంబర్ 28వ తేదీ వరకు మార్పులు చేసుకునేందుకు అవకాశం ఉంది. సెప్టెంబర్ 28న బీసీసీఐ 15 మంది ఆటగాళ్లతో కూడిన తుది జాబితాను ఐసీసీకి సమర్పించనుంది. 🏆 🤝


bottom of page