top of page

🇮🇳 నారీ శక్తి వందన్ చట్టానికి పార్లమెంట్‌లో ఆమోదం..

🇮🇳 మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆమోదం పొందిన తర్వాత ప్రధాని మోడీ మహిళా ఎంపీలతో ఫొటో దిగారు. 📸 ఈ బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా ఎంపీలు మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు. 🎉

బిల్లును ఆమోదించడంలో ప్రధాని మోడీ నిర్ణయాత్మక నాయకత్వం వహించారని పలువురు మహిళా సభ్యులు ప్రశంసించారు. 👍 🌸 తాము మద్దతిచ్చిన చట్టాన్ని సంబరాలు చేసుకునేందుకు.. మార్పుకు నాంది పలికిన వారందరూ కలిసి రావడం హర్షణీయమని ప్రధాని మోడీ అన్నారు. 🙏 💪 నారీ శక్తి వందన్ చట్టం ఆమోదంతో భారతదేశం మన నారీ శక్తితో ఉజ్వలమైన, మరింత సమ్మిళిత భవిష్యత్తుతో హిమాలయ శిఖరం వద్ద నిలుస్తుంది. 🌄 అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. 🇮🇳 ఈ రోజు మనం జరుపుకుంటున్న సంబరాలతో మన దేశంలోని మహిళలందరి శక్తి, ధైర్యం, అలుపెరగని స్ఫూర్తిని మనం గుర్తు చేసుకుంటున్నామని ప్రధాన మంత్రి అన్నారు. 🇮🇳👭🌟

Comentarios


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page