ప్రమాదంతో ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. ఒక మహిళా ప్రయాణికురాలు సజీవ దహనమైంది..ప్రమాదం జరిగిన బస్సులో సుమారు 40-50మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఘోరప్రమాదం జరిగింది. బీచుపల్లి పదవ పొలీస్ బెటాలియన్ సమీపంలో అర్థరాత్రి పెను విషాదం చోటు చేసుకుంది. హైదరాబాదు నుంచి చిత్తూరు వెళుతున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ప్రమాదంతో ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. ఒక మహిళా ప్రయాణికురాలు సజీవ దహనమైంది..ప్రమాదం జరిగిన బస్సులో సుమారు 40-50మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. హైదరాబాదు నుంచి చిత్తూరు వెళుతున్న వోల్వో బస్సు బీచుపల్లి కృష్ణ నది దాటింది.. ఆ తర్వాత అల్లంపూర్ నియోజకవర్గం ఇటిక్యాల మండలం పదవ బెటాలియన్ సమీపంలో అదుపు తప్పి బస్సు బోల్తా కొట్టింది.. ఈ క్రమంలోనే బస్సులో ఒకసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా మిగతా 30 మందికి పైగా సురక్షితంగా బయటపడ్డారు.
సమాచారం మేరకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సిబ్బంది, పోలీసులు హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం నుంచి ప్రయాణికులను కాపాడారు. 30 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీశారు. కానీ ఒక మహిళను కాపాడే ప్రయత్నంలో బస్సులో ఉండి బయటికి రాలేని స్థితిలో చెయ్యి విరుక్కపోవడంతో ఒక మహిళ బస్సులోనే మృతి చెందడం జరిగిందని ఎన్ హెచ్ ఎ ఐ పెట్రోలింగ్ సిబ్బంది తెలిపారు. బస్సు ప్రమాదం నుంచి బయట పడిన ప్రయాణికులలో కొంతమందికి స్వల్ప గాయాలు అయినట్లుగా చెప్పారు. వీరిలో ఇద్దరికీ తీవ్ర గాయాలైనట్టుగా చెప్పారు.