top of page

రీల్స్ కోసం రద్దీగా ఉన్న రోడ్డుపై మహిళ డ్యాన్స్..


ఈ వీడియోలో.. ఓ మహిళ రీల్స్ కోసం రోడ్డుపైకి వచ్చింది. అదే సమయంలో జోరుగా వర్షం పడుతుంది. ఓ మహిళ కారు పై నుంచి కిందుకు దూకి రోడ్డుపై డ్యాన్స్ చేస్తుంది. ఆ రోడ్డు బాగా రద్దీగా ఉన్నట్టు కనిపిస్తుంది. వాహనాలు వేగంగా రోడ్డుపై వెళ్తున్నాయి. కానీ ఆ మహిళ ఏ మాత్రం లెక్క చేయకుండా రోడ్డుపై చిందులు వేస్తుంది. పైగా సైడ్‌కి కూడా కాదు. రోడ్డుకి కాస్త మధ్యలోనే డ్యాన్స్ వేస్తుంది. రోడ్డుపై వెళ్లే వాళ్లు ఆమెను చూస్తున్నారు. వర్షంలో మహిళ డ్రెస్ మొత్తం తడిచిపోయి.. అసభ్యకరంగా ఉంది. అయినా ఏమీ లెక్క చేయకుండా డ్యాన్స్ చేసిన.. వీడియోను సదరు మహిళ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోపై యూపీ పోలీసులు కూడా రియాక్ట్ అయ్యారు. సదరు మహిళలకు లీగల్ నోటీసులు జారీ చేశారు. అలాగే ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా కామెంట్స్ చేస్తున్నారు. ‘అది రోడ్డు అనుకున్నావా తల్లీ.. నీ ఇల్లు అనుకున్నావా’.. ‘రీల్స్ కోసం ఇంతలా చేయడం అవసరమా’.. ‘వ్యూస్ కోసం మరీ ఇంతలా దిగజారాలా’.. ‘వీడియో తీస్తున్న వారికి కూడా బుద్ధి లేదు’.. ‘రోడ్డు మధ్యలో ఈ డ్యాన్సులు ఏంటి.. ఏదన్నా ప్రమాదం జరిగితే’ అంటూ మహిళపై తీవ్రంగా మండి పడుతున్నారు.



Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page