top of page
Shiva YT

🌟🔄 కామ్రేడ్ల ఆశలు ఫలించేనా.. ఆ పార్లమెంట్ సీటుపై సీపీఐ కన్ను..!

🗳️🔴 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి బరిలో దిగిన సీపీఐ పార్టీ.. ఒక్క స్థానంలో గెలిచి సత్తా చాటింది. కొత్తగూడెం నుంచి పోటీచేసిన ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గెలుపొందారు.

ఇప్పడు అదే ఊపుతో రానున్న లోక్ సభ ఎన్నికల్లోనూ ఒక సీటులో పోటీ చేయాలని భావిస్తోంది. తాము తెలంగాణలో ఒక చోట బరిలో ఉండబోతున్నట్లు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ తమను కలుపుకోని పోవడంతోనే ఇక్కడ అధికారంలోకి వచ్చిందని.. ఐదు రాష్ట్రాల్లో తమను కలుపుకోకుండా వెళ్లడంతో రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్ లలో ఓడిపోయిందని నారాయణ పేర్కొన్నారు. లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమిలో ఉన్న వామపక్షాలు.. ఇతర పార్టీలను కలుపుకోని వెళ్లాలని నారాయణ కాంగ్రెస్ కు సూచించారు.

🤞🌐 అయితే, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వామపక్షాలకు కొంచెం గట్టిగానే ప్రాబల్యం ఉంది.. కొత్తగూడెంలో సీపీఐ అభ్యర్ధిగా పోటిచేసిన కూనంనేని సాంబశివరావు.. కాంగ్రెస్ మద్దతుతో గెలిచారు. ఇప్పుడు లోక్ సభ సీటు విషయంలోనూ ఖమ్మం జిల్లా నుంచే ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఖమ్మం లోక్ సభ నియోజకవర్గం నుంచి 2014లో పోటీ చేసి ఓడిపోయారు. సీమాంధ్ర నాయకుడిగా నారాయణను చూడటం, స్థానికుడు కాదన్న ముద్ర ఉండటం, ఓట్లు బదలాయింపు జరగకపోవడం.. ఇలా అనే కారణలతో ఆయన ఓటమిపాలయ్యారు. అప్పుడు కూడా కాంగ్రెస్ తో పొత్తులో భాగంగానే సీపీఐ ఖమ్మం నుంచి పోటీ చేసింది. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ పొత్తు ఫలించడం.. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఈ సారి విజయావకాశలు ఎక్కువ అని లెప్ట్ పార్టీలు భావిస్తున్నాయి. 🌟🔄

bottom of page