top of page
Shiva YT

🚨 ఏపీలో రేవంత్‌ రెడ్డి ప్రచారం చేస్తారా..?

తెలంగాణ సీఎం రేవంత్, మంత్రి సీతక్క లాంటి వాళ్లు టీడీపీ అధినేత చంద్రబాబుకు అనుకూలంగా ఉన్నారనే ప్రచారం ఉండనే ఉంది. ఈ నేపథ్యంలో ఏపీకి వెళ్లి తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తారా?

చేతులు ఎత్తేస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో ఎవరెవరితో ఎక్కడ ప్రచారం చేయించాలనే దానిపై లెక్కలు వేస్తున్నట్లు సమాచారం. ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుతో ఆ పక్కనే ఉన్న విజయవాడ చుట్టు పక్కల ప్రచారం చేయిస్తే ఎలా ఉంటుందనే దానిపై చర్చ సాగుతోంది.

ఈ ఇరువురు నేతల్లో ఒకరు చంద్రబాబు మద్దతు దారు కాగా… మరొకరు జగన్ మద్దతుదారు. తుమ్మల నాగేశ్వర్ రావు తన ఎన్నికల ప్రచారంలో టీడీపీ నేతలతో సమావేశాలను కూడా నిర్వహించుకున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి… ఏపీ సీఎం జగన్ ప్రభుత్వంలో పలు కాంట్రాక్టు పనులు చేసుకున్నారని వార్తలు వచ్చాయి. నల్గొండ జిల్లాకు చెందిన మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ లతో గుంటూరు జిల్లాలో ప్రచారం చేయిస్తే ఎలా ఉంటుందనే దానిపై అధిష్టానం ఆలోచన చేస్తోంది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి … వైఎస్ కుటుంబానికి సన్నిహితంగా ఉంటారు. ఏపీకి వెళ్ళి ఆయన జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తారా ? లేదా అన్నది చూడాలి. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన జూపల్లి కృష్ణారావుతో కర్నూలు జిల్లాలో ప్రచారం చేయిస్తే ఎలా ఉంటుందనే దానిపై చర్చ సాగుతోంది.

bottom of page