top of page

ప్రభాస్ కోసం స్పెషల్ గన్స్.. వీడియో రిలీజ్ చేసిన మేకర్స్🌟🎞️

స‌లార్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత ప్రభాస్‌ కథానాయకుడిగా తెర‌కెక్కుతున్న తాజా చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. సైన్స్ ఫిక్ష‌న్ జాన‌ర్‌లో వ‌స్తున్న ఈ చిత్రానికి మ‌హాన‌టి సినిమా ఫేమ్ నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్ట‌ర్స్, గ్లింప్స్‌ల‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

స‌లార్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత ప్రభాస్‌ కథానాయకుడిగా తెర‌కెక్కుతున్న తాజా చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. సైన్స్ ఫిక్ష‌న్ జాన‌ర్‌లో వ‌స్తున్న ఈ చిత్రానికి మ‌హాన‌టి సినిమా ఫేమ్ నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్ట‌ర్స్, గ్లింప్స్‌ల‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుండ‌గా ఈ మూవీ నుంచి కొత్త అప్‌డేట్ ఇచ్చారు మేక‌ర్స్ 

స్క్రాచ్ ఎపిసోడ్ -3 : గ‌న్స్ రీ-ఇమాజినింగ్ అంటూ ఈ ఒక వీడియో విడుద‌ల చేయ‌గా.. ఈ వీడియోలో కల్కి సినిమాలో వాడే గ‌న్స్ (KALKI Guns) ఎలా రూపొందించారు అనేది చూపించారు. 97 సెక‌న్లు ఉన్న ఈ వీడియో మొద‌టి నుంచి చివ‌రివ‌ర‌కు ఫ‌న్నీగా సాగింది. అంత‌కుముందు ఈ సినిమాకు సంబంధించి సినిమాలో వాడే వాహనాల టైర్‌ల (Tyre) గురించి కూడా ఒక వీడియో వ‌దిలిన విష‌యం తెలిసిందే. మ‌రోవైపు ఈ మూవీ ట్రైల‌ర్‌ను ఏప్రిల్ 1న విడుద‌ల చేయ‌నున‌ట్లు ప్ర‌క‌టించాడు.

ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ యాక్టర్లు దీపికా పదుకొనే , దిశా పటానీ, అమితాబ్‌ బచ్చన్‌, లజెండరీ యాక్టర్‌ కమల్‌ హాసన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి మేకర్స్‌ లాంఛ్ చేసిన కల్కి 2898 ఏడీ రైడర్స్‌ (యూనిఫార్మ్‌డ్‌ విలన్‌ ఆర్మీ) కాస్ట్యూమ్స్‌ మేకింగ్‌, అసెంబ్లింగ్‌ వీడియో క్యూరియాసిటీని అమాంతం పెంచేస్తుంది. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై సీ అశ్వనీదత్‌ సుమారు 500 కోట్లకుపైగా బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు.🌟🎞️

コメント


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page