చంద్రయాన్ - 3ల్యాండర్ చంద్రునిపై దిగేందుకు కీలక ఘట్టం ఆసన్నమైంది. భారత్‌తో పాటు ప్రపంచదేశాలు సైతం చంద్రయాన్ -3 పై ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.
అయితే ప్రయోగాలు ఏం మార్పులు లేకుండా.. అన్ని అనుకున్నట్లు జరిగితే బుధవారం సాంయత్రం సరిగ్గా 6.04 PM గంటలకు విక్రమ్ ల్యాండర్ చంద్రని దక్షిణ ధ్రువం ఉపరితలంపై కాలు మోపనుంది. ఇక సాయంత్రం 5.20 PM గంటల నుంచే ఈ ప్రయోగం ప్రత్యక్ష ప్రసారం కానుంది. ల్యాండర్ మాడ్యూల్ ప్రస్తుతం చంద్రునికి అత్యంత సమీపానికి చేరుకుంది. ఇక ల్యాండింగ్‌కు రెండు గంటల ముందు ల్యాండర్‌లో ఉన్న సైంటిఫిక్ పరికరాలతో చంద్రుడి ఉపరితలంపై పరిస్థితిని మళ్లీ ఒకసారి క్షుణ్నంగా సమీక్షిస్తామని ఇస్రో తెలిపింది. పరిస్థితి పూర్తి అనుకూలిస్తేనే ల్యాండ్ చేస్తామని తెలిపింది. ఒకవేళ అనుకూలంగా లేకపోతే ల్యాండింగ్ ప్రక్రియను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేయనున్నట్లు ఇస్రో అధికారిక వర్గాల నుంచి సమాచారం వచ్చింది. 2019లో చేపట్టిన చంద్రయాన్–2 ప్రయోగం విఫలం కావడం, అలాగే తాజాగా రష్యా లూనా–25 క్రాష్ ల్యాండింగ్ అయిన నేపథ్యంలో చంద్రయాన్–3 విషయంలో ఇస్రో శాస్త్రవేత్తలు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 🛰️📡🌌