top of page

బిగ్‌బాస్ హౌస్‌లోకి బర్రెలక్క వచ్చేనా? ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా.. వీడియో రిలీజ్


బిగ్ బాస్ తెలుగు కొత్త సీజన్ ప్రారంభానికి సమయం దగ్గర పడుతోంది. ఇప్పటికే కంటెస్టెంట్స్ ఇంటర్వ్యూలు పూర్తయ్యాయని, లిస్టులో ఉన్న అందరికీ ఫోన్ కాల్స్ వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే ఎనిమిదో సీజన్ కు సంబంధించి అన్నపూర్ణ స్టూడియోలో బిగ్ బాస్ హౌస్ సెట్ కు సంబంధించిన పనులు కూడా దాదాపు పూర్తి కావొచ్చాయట. ఇదిలా ఉంటే బిగ్ బాస్ కొత్త సీజన్ కంటెస్టెంట్లపై సోషల్ మీడియాలో జోరుగా చర్చలు నడుస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటటికే ఎన్నో పేర్లు తెరపైకి వచ్చాయి. అందులో సోషల్ మీడియా సెన్సేషన్ బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. గత ఏడాది కాలంగా వివిధ విషయాలతో బాగా వార్తల్లో నిలుస్తుందామె. ముఖ్యంగా తెలంగాణ ఎన్నికల సందర్భంగా బర్రెలక్క పేరు మార్మోగిపోయింది. నిరుద్యోగుల తరఫున ఎన్నికల బరిలో నిలిచిన ఆమెకు జేడీ లక్ష్మీ నారాయణ, రామ్ గోపాల్ వర్మ వంటి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు మద్దతిచ్చారు. ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయిన బర్రెలక్క బిగ్ బాస్ సీజన్ 8లో కంటెస్టెంట్ చేస్తుందంటూ ప్రచారం జరుగుతోంది. తాజాగా దీనిపై ఆమె స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను రిలీజ్ చేసింది. అందులో ఇలా చెప్పుకొచ్చింది. నా ఫేమ్ తగ్గిపోయిందట.. అందుకే..

. ‘ ఈ మధ్యన చాలా మంది నన్ను అక్కా… మీరు బిగ్ బాస్ షోకి వెళుతున్నారా? అని అడుగుతున్నారు. బిగ్ బాస్ రివ్యూవర్స్ కూడా నాకు హౌస్‌లోకి వచ్చే ఛాన్స్ వచ్చిందంటూ వీడియోలు చేస్తున్నారు. వీటిని నాకు తెలిసిన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేస్తున్నారు. నాకు తెలిసిన సమాచారం ప్రకారం.. బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ కంటెస్టెంట్స్ లిస్ట్ లో నా పేరు ఉంది. అయితే గత కొన్ని నెలలుగా నా ఫేమ్ బాగా తగ్గిపోయిందట. ఇప్పుడు నన్ను తీసుకోవడం అవసరమా? అని ఆలోచిస్తున్నారట. మనిషికి ప్రాణమే శాశ్వతం కాదు. అలాంటిది ఫేమ్ శాశ్వతమా? హిట్ సినిా కూడా థియేటర్లలో నెల రోజులు మాత్రమే ఆడుతుంది. సూపర్ హిట్ మూవీ బహుశా రెండు నెలలు ఆడుతుంది. నాకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చినా, రాకున్నా ఇబ్బంది ఏం లేదు. నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, నన్ను ఇష్టపడే అభిమానులకు ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలని ఈ వీడియో చేశాను’ అని చెప్పుకొచ్చింది బర్రెలక్క.



Kommentare


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page