top of page
Shiva YT

📅 అక్టోబరు నెలలో దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ అమ్మకాలు ఎందుకు తగ్గాయి? 🤨

🛢️ అక్టోబరు 1 నుంచి 15వ తేదీ మధ్యకాలంలో వీటి అమ్మకాలు బాగా తగ్గాయని గణాంకాలు చెబుతున్నాయి. 📊

ప్రభుత్వ రంగంలోని మూడు చమురు సంస్థల గణాంకాల ప్రకారం.. 📈 గతేడాది అక్టోబర్‌ 1 నుంచి 15 వరకూ జరిగిన అమ్మకాలతో పోలిస్తే ఈ ఏడాది అక్టోబరు తొలి అర్ధ భాగంలో పెట్రోల్‌ విక్రయాలు 9 శాతం క్షీణించి 1.17 మిలియన్‌ టన్నులుగా ఉంది. 📉 డీజిల్‌ అమ్మకాలు 3.2 శాతం తగ్గి 2.99 మిలియన్‌ టన్నులకు చేరింది. 💨 2022 అక్టోబర్‌లో దసరా, దీపావళి ఒకే నెలలో రావడంతో పెట్రోల్, డీజిల్‌ వినియోగం అధికంగా జరిగింది. 🎆 2023 సెప్టెంబర్‌ నెల మొదటి అర్ధభాగంతో పోలిస్తే ఈ నెల మొదటి 15 రోజుల్లో పెట్రోల్‌ విక్రయాలు 9 శాతం తగ్గాయి. ⛽ డీజిల్‌ అమ్మకాలు మాత్రం 9.6 శాతానికి పెరిగాయి. 2022 అక్టోబర్‌తో పోలిస్తే ఈ నెల అర్ధ భాగంలో విమాన ఇంధన డిమాండ్‌ 5.7 శాతం దూసుకెళ్లి 2,95,200 టన్నుల అమ్మకాలను నమోదు చేసింది. 🌧️ రుతుపవనాలు రాకతో వ్యవసాయరంగంలో వర్షాకాలం డీజిల్‌ అమ్మకాలు క్షీణిస్తాయి. 🌦️ వర్షాలు కారణంగా వాహనాలు వినియోగం తగ్గుతుంది కనుక ఈ సీజన్‌లో డీజిల్‌ వినియోగం తగ్గింది. 💧 2023 అక్టోబర్‌లో 1 నుంచి 15 తేదీల మధ్య పెట్రోల్‌ వినియోగం పెరిగింది. 2021 అక్టోబర్‌తో పోలిస్తే 12 శాతం, 2019 అక్టోబర్‌తో పోలిస్తే 21.7 శాతం పెరిగింది. 📆 అలాగే డీజిల్‌ వాడకం 2021 అక్టోబర్‌తో పోలిస్తే 23.4 శాతం, 2019 అక్టోబర్‌తో పోలిస్తే 23.1 శాతం అధికమైంది. 🚚 విమాన ఇంధన వినియోగం 2021 అక్టోబర్‌తో పోలిస్తే 36.5 శాతం అధికం కాగా, 2019 అక్టోబర్‌తో పోలిస్తే 6.6 శాతం తక్కువ నమోదైంది. 🌍 వంటకు ఉపయోగించే ఎల్‌పీజీ విక్రయాలు 1.2 శాతం పెరిగి 1.25 మిలియన్‌ టన్నులుగా ఉంది. 🚛📈

bottom of page