top of page
Suresh D

కొత్త సినిమాలు శుక్రవారం మాత్రమే ఎందుకు రిలీజవుతాయి?🎥🎭

సాధారణంగా భారతదేశంలో శుక్రవారమే ఎక్కువగా కొత్త సినిమాలను విడుదల అవుతాయి. టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్, సాండల్‌ వుడ్‌, మాలీవుడ్‌.. ఏ ఇండస్ట్రీలోనైనా సినిమా నిర్మాతలు కూడా శుక్రవారం రోజే తమ సినిమాల రిలీజ్‌చేస్తుంటారు. పండగలు, పర్వదినాలు, ప్రత్యేక సందర్భాలు మినహాయిస్తే ఎక్కడైనా ఫ్రైడేనే మూవీ ఫెస్టివల్‌ ఉంటుంది.

సాధారణంగా భారతదేశంలో శుక్రవారమే ఎక్కువగా కొత్త సినిమాలను విడుదల అవుతాయి. టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్, సాండల్‌ వుడ్‌, మాలీవుడ్‌.. ఏ ఇండస్ట్రీలోనైనా సినిమా నిర్మాతలు కూడా శుక్రవారం రోజే తమ సినిమాల రిలీజ్‌చేస్తుంటారు. పండగలు, పర్వదినాలు, ప్రత్యేక సందర్భాలు మినహాయిస్తే ఎక్కడైనా ఫ్రైడేనే మూవీ ఫెస్టివల్‌ ఉంటుంది. కాగా ఈ ట్రెండ్ హాలీవుడ్‌లో 1939లో మొదలైంది. అక్కడి నుంచి బాలీవుడ్‌లో ఈ ట్రెండ్ మొదలవ్వడానికి 20 ఏళ్లు పట్టింది . మరో మాటలో చెప్పాలంటే, 1960లలో బాలీవుడ్‌లో శుక్రవారం సినిమాలను విడుదల చేయడం ప్రారంభించింది . తర్వాత మిగిలిన సినీ ఇండస్ట్రీలు కూడా అదే బాట పట్టాయి. మొఘల్-ఎ-ఆజం భారతదేశంలో శుక్రవారం విడుదలైన మొదటి చిత్రం. ఈ చిత్రం ఆగస్టు 5, 1960న విడుదలైంది. దీని తర్వాత కొత్త సినిమాలు విడుదల ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. మరి నిర్మాతలు తమ సినిమాలను శుక్రవారమే విడుదల చేస్తారు? . అయితే వారి నిర్ణయం వెనక కొన్ని ప్రధాన కారణాలున్నాయి. భారతదేశంలో శుక్రవారాన్ని శుభదినంగా పరిగణిస్తారు. అలాగే లక్ష్మీ దేవి రోజుగా భావిస్తారు. లక్ష్మీదేవి ఉంటే దరిద్రం రాదని నమ్మే వారు చాలా మంది ఉన్నారు. అందుకే చాలా మంది నిర్మాతలు తమ సినిమాలను శుక్రవారాల్లోనే విడుదల చేసేందుకు ఇష్టపడుతున్నారు. సినిమాల విడుదలకే కాదు ముహూర్తపు షాట్లకు కూడా చాలా మంది శుక్రవారాన్ని ఎంచుకుంటున్నారు. ఈ రోజున సినిమా ప్రారంభిస్తే/విడుదల చేస్తే లాభాలు వస్తాయని నిర్మాతలు నమ్ముతున్నారు.దీనికి మరో కారణం వారాంతం కావడం. చాలా కంపెనీలు శనివారం ఆదివారం సెలవులు అందిస్తున్నాయి. శుక్రవారం నుంచి అందరూ వీకెండ్ మూడ్‌లో ఉంటారు. ఈ రోజు సినిమా విడుదలైతే శని, ఆదివారాల్లో ప్రేక్షకులు భారీగా థియేటర్లకు వస్తారు. దీని వల్ల సినిమాకు భారీ కలెక్షన్లు వస్తాయి.🎥🎭


bottom of page