top of page

వారెవ్వా.. రుచి అంటే ఇదే..!


భారతీయ వంటల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వెజ్ అయినా.. నాన్ వెజ్ అదిరిపోవాల్సిందే.. ప్రపంచ దేశాల్లో ఎవరు టేస్ట్ చేసినా.. వాహ్ వా.. సూపర్ అంటూ కితాబివ్వాల్సిందే. మరి ముఖ్యంగా చెప్పాలంటే.. నాన్ వెజ్ చికెన్ వంటకాలు టాప్ లో ఉంటాయి.. బటర్ చికెన్.. చికెన్ టిక్కా.. ఇలా చికెన్ మసాలా వంటకాల గురించి చెబితే నోరూరిపోవాల్సిందే.. ఇక తింటే అదరహో అనాల్సిందే.. భారతదేశంలో చేసే ఏ చికెన్ రెసెపీ అయినా ఎంతో రుచికరంగా ఉంటుంది. అందుకే.. ప్రపంచ దేశాల్లో ఇండియన్ చికెన్ రెసెపీస్ కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది..

భారతీయ మసాలాలతో రుచిగా ఉండే చికెన్ రెసెపీలకు తిరుగులేదని మరోసారి రుజువైంది.. వండినా (గ్రేవీ) లేదా కాల్చిన (గ్రిల్డ్) చికెన్ రుచిని ఏదీ అధిగమించలేదంటూ గ్లోబల్ ఫుడ్ రేటింగ్ ప్లాట్‌ఫారమ్ విడుదల చేసిన జాబితాలో నిరూపితమైంది..

గ్లోబల్ ఫుడ్ రేటింగ్ ప్లాట్‌ఫారమ్ టేస్ట్ అట్లాస్‌లో మొదటి ఐదు బెస్ట్ చికెన్ రెసెపీస్ జాబితాలో అత్యంత ప్రసిద్ధ బటర్ చికెన్ రెసెపీ చోటు దక్కించుకుంది. ఇది నాలుగో స్థానంలో నిలిచింది.

భారతదేశపు ప్రఖ్యాత వంటకం బటర్ చికెన్ తోపాటు చికెన్ టిక్కా ఆరవ స్థానంలో నిలిచింది. చికెన్ 65 10వ స్థానంలో, తందూరి చికెన్ 18వ స్థానంలో ఉన్నాయి. తాజాగా.. గ్లోబల్ ఫుడ్ రేటింగ్ ప్లాట్‌ఫారమ్ టేస్ట్ అట్లాస్‌.. 50 బెస్ట్ చికెన్ డిషెస్ ను విడుదల చేసింది. వాటిలో భారత్ కు సంబంధించిన బటర్ చికెన్, చికెన్ టిక్కా, చికెన్ 65, తందూరి చికెన్ బెస్ట్ చికెన్ డిషెస్ గా నిలిచాయి.

సంతోషకరమైన విషయం ఏంటంటే.. భారతీయ చికెన్ వంటకాలన్నీ టేస్ట్ అట్లాస్‌లో టాప్ 20లో చోటుదక్కించుకున్నాయి. బటర్ చికెన్, చికెన్ టిక్కా, చికెన్ 65, తందూరి చికెన్.. ఇవన్నీ ప్రపంచంలోని ఉత్తమ చికెన్ వంటకాల కెటగిరీలో చేరాయి. బటర్ చికెన్, చికెన్ టిక్కా, చికెన్ 65 కు 4.5 రేటింగ్ దక్కగా.. తందూరి చికెన్ కు 4.4 రేటింగ్ లభించింది.

బటర్ చికెన్ రుచిగా ఉండే బట్టరీ గ్రేవీలో వండిన పర్ఫెక్ట్ గా గ్రిల్డ్, మ్యారినేట్ చేసిన చికెన్‌ని కలిగి ఉంటుంది. ఇది తరచుగా రోటీ, రుమాలీ రోటి లేదా అన్నంతో వడ్డిస్తారు.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page