top of page

‘ఇంద్ర’ షూటింగ్‏లో చిరంజీవి వెనక ఉన్న కుర్రాడు ఎవరో తెలుసా..?


ఇంద్ర సినిమాలోని ప్రతి సాంగ్ సూపర్ హిట్. ఇప్పటికీ ఈ సినిమాలోని వీణ స్టెప్ ఎవర్ గ్రీన్. అయితే ఈ మూవీలోని అమ్మడు బుచ్చి పాటకు మెగాస్టార్ స్టెప్పుల గురించి చెప్పక్కర్లేదు. ఈ పాటకు రాఘవ లారెన్స్ కొరియోగ్రఫీ చేశారు. సాంగ్ షూటింగ్ కు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. అందులో చిరంజీవి కుర్చొని ఉండగా.. ఓ కుర్రాడు వెనకాలే నిల్చున్నాడు. అతడు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరో. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరో. అతడి యాక్టింగ్, స్టైల్ కు విదేశాల్లోనూ ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటివరకు తెలుగులో అనేక హిట్ చిత్రాల్లో నటించారు. ఇంతకీ అతడు ఎవరో తెలుసా.. ఇంకెవరు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇంద్ర షూటింగ్ సెట్ లో సందడి చేశాడు చరణ్. ఆ వీడియోలో టీనేజ్ రామ్ చరణ్ ను చూడొచ్చు. చరణ్ తోపాటు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా కనిపిస్తున్నాడు. వరుణ్ తేజ్ ఎంతో ఛబ్బీగా ఉన్నాడు. రామ్ చరణ్ , వరుణ్ తేజ్ స్కూల్ హాలీడేస్ సమయంలో చిరుతో కలిసి షూటింగ్ సెట్ల్ లో సందడి చేసేవారు. ప్రస్తుతం వీరిద్దరు స్టార్ హీరోలుగా స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు.



Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page