తెలంగాణలో కాంగ్రెస్‌ను ఎవరు రక్షిస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రశ్నించారు. కర్ణాటక వాల్మీకి స్కామ్‌తో రాష్ట్ర నేతలు, వ్యాపారవేత్తలకు లింకులు ఉన్నాయని చెప్పారు. కర్ణాటక ఎస్టీ కార్పొరేషన్ నుంచి హైదరాబాద్‌లోని 9 బ్యాంకు అకౌంట్లకు రూ.45 కోట్లు బదిలీ అయ్యాయి. అందులో వీ6 బిజినెస్ ఓనర్‌కు రూ.4.5 కోట్లు బదిలీ అయ్యాయయని, అతడు ఎవరని నిలదీశారు. లోక్‌సభ ఎన్నికల వేళ నగదు డ్రా చేసిన బార్లు, బంగారు దుకాణాల నిర్వాహకులు ఎవరన్నారు. వారికి కాంగ్రెస్‌తో ఉన్న సంబంధం ఏంటన్నారు. వాల్మీకి స్కామ్‌కు సంబంధించి రాష్ట్రంలో సిట్, సీఐడీ, ఈడీ సోదాలు జరిగాయని, దర్యాప్తు సంస్థల సోదాల వార్తలు బయటకు రాకుండా అణచివేశారని చెప్పారు.
రూ.90 కోట్లు అవినీతి జరిగిందని కర్ణాటక అసెంబ్లీలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారని చెప్పారు. సిద్ధరామయ్యను తొలగిస్తే తెలంగాణ ప్రభుత్వమూ కూలిపోతుందని కర్ణాటక మంత్రి సతీశ్ జార్కిహోళి అన్నారు. అందులో అర్ధమేమిటి. ఇన్ని అంశాలు వెలుగులోకి వచ్చినా ఈడీ మౌనంగా ఎందుకు ఉన్నదని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను ఎవరు రక్షిస్తున్నారు? అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.