top of page
Shiva YT

లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ పోటీ ఎక్కడ?

దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటికే ప్రచార కార్యక్రమాల్లో మునిగిపోయాయి. 🗓️ పార్టీలు, సిద్ధాంతాలు చూసి ఓటేసే రోజులు పోయి ప్రధాని లేదా సీఎం అభ్యర్థి ఎవరు అన్నది చూసి ఓటేసే రోజులు వచ్చాయి. 🔍 భారతీయ జనతా పార్టీ (BJP) నేతృత్వంలోని అధికార ‘నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్’ (NDA) కూటమి ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీ కనిపిస్తున్నారు. 🇮🇳

 ‘ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్’ (I.N.D.I.A) పేరుతో జట్టుకట్టిన విపక్ష కూటమి అధికారికంగా తమ ప్రధాని అభ్యర్థి ఎవరన్నది ప్రకటించలేదు. ఈ విషయంలో ఏకాభిప్రాయం లేదన్న విషయం అందరికీ తెలుసు. 🌐 కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీలో గాంధీ-నెహ్రూ కుటుంబ వారసుడిగా రాహుల్ గాంధీయే తమ కాబోయే ప్రధాని అంటూ ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు చెబుతుంటారు. 🌟 అవకాశం దొరికితే ప్రధాని పీఠంపై కూర్చునేందుకు మమత బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, శరద్ పవార్ వంటి నేతలు ఎదురుచూస్తున్నప్పటికీ.. మొత్తంగా దేశంలో ఎన్నికల వాతావరణం నరేంద్ర మోదీ వర్సెస్ రాహుల్ గాంధీ అన్నట్టుగా తయారైంది. ఈ ఇద్దరిలో ప్రజలు ఎవరిని ప్రధానిగా కోరుకుంటారో ఆ పార్టీకి లేదా కూటమికి ఓటు వేయాలి అన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో ప్రధాని అభ్యర్థులు పోటీ చేసే నియోజకవర్గాలు కూడా చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ గత పదేళ్లుగా ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి నుంచే మళ్లీ పోటీ చేస్తారన్న విషయంలో ఎవరికీ సందేహం లేదు. కానీ విపక్ష కూటమి అప్రకటిత ప్రధాన అభ్యర్థిగా ఉన్న రాహుల్ గాంధీ పోటీ చేసే నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ, కంచుకోటలో ఓటమిపాలై వాయనాడ్ విజయంతో సరిపెట్టుకున్నారు. ఈసారి ఆయన ఎక్కణ్ణుంచి బరిలోకి దిగుతారన్నది ఆసక్తికరంగా మారింది. 🗳️


Comments


bottom of page