top of page

🔍👥 రాహుల్‌ మాట ఇప్పుడు ఎక్కడికి పోయింది..? కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ముందే అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటలయుద్ధం మొదలైంది. 🏛️ శాఖలవారీగా శ్వేతపత్రాల విడుదలకు కాంగ్రెస్‌ యాక్షన్‌ప్లాన్‌ రెడీ చేసుకుంటోంది. 📜

ఈ సమయంలో కాంగ్రెస్‌ శ్వేతపత్రాలపై మాజీ మంత్రి కేటీఆర్‌ విమర్శలు సంధించారు. 🗣️ అసెంబ్లీలోని BRS LP కార్యాలయంలో మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడిన KTR.. 🎙️ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. 📢 ప్రతిఏటా తాము ఇచ్చిన ఆడిట్ రిపోర్ట్ శ్వేతపత్రం కాదా అంటూ కేటీఆర్‌ ప్రశ్నలు సంధించారు. ❓ ప్రతి బడ్జెట్‌లో అప్పులపై అసెంబ్లీలో ఉంటుందని పేర్కొన్నారు. 💼 అసెంబ్లీలో పెట్టే ఆడిట్‌ రిపోర్ట్‌లే శ్వేత పత్రాలని.. 📄 అంతకుమించిన శ్వేతపత్రం ఉంటుందా అంటూ కేటీఆర్ పేర్కొన్నారు. 🤔 కాంగ్రెస్‌ నేతలు చదవకపోతే తాము ఏం చేస్తామంటూ కేటీఆర్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 📢 హామీలు ఇచ్చినప్పుడు కాంగ్రెస్‌ వాళ్లకు తెలియదా..? లెక్కలు వేసుకోకుండానే హామీలు ఇచ్చారా? ❓ అంటూ కేటీఆర్‌ పేర్కొన్నారు. 🎤 తాము ఉన్నప్పుడు ఉన్న పరపతి ఇప్పుడు ఎక్కడ పోయిందంటూ ప్రశ్నించారు. 🤷 పరపతి లేకుండా తమకు కూడా అప్పులు పుట్టవు కదా అంటూ చెప్పారు.

రుణమాఫీపై కూడా కేటీఆర్ స్పందించారు. 24 గంటల్లో రుణమాఫీ అని రాహుల్‌ గాంధీ చెప్పారు.. 🕰️ రాహుల్‌ చెప్పిన మాట ఇప్పుడు ఎక్కడికి పోయిందంటూ మాజీ మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. 🗣️🤷‍♂️📰


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page