top of page
Shiva YT

🌐 తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ ఎప్పుడు? హింట్ ఇచ్చిన మంత్రి ఉత్తమ్.

🚀 తెలంగాణ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరగానే మంత్రులు శాఖల వారీగా సమీక్షలు మొదలు పెట్టారు. 🌐 మొదటిసారిగా సివిల్ సప్లై డిపార్ట్‌మెంట్‌పై రివ్యూ చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఆ శాఖకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు.

🍚 రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు, కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అంశాలపై ఆరా తీశారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు వంద రోజుల్లో పూర్తి చేసే పనిలో ఉన్నామని, ఆ దిశగా పనిచేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

🌾 సివిల్ సప్లై శాఖపై రివ్యూ చేసిన మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. 🍚 రేషన్ పంపిణీ విషయం లో నాణ్యత పాటించాలని, పేదలు తినే బియ్యంలో క్వాలిటీ ఉండాలని అధికారులకు సూచించారు మంత్రి. రైతుల దగ్గర నుండి కొన్న బియ్యానికి తక్షణమే డబ్బుల చెల్లింపు చేపట్టాలని ఆదేశించారు.

🌐 సివిల్ సప్లై శాఖ పై సమీక్షలో చాలా విషయాలు తెలుసుకున్నానని తెలిపిన మంత్రి.. గత ప్రభుత్వం ఈ డిపార్ట్‌మెంట్‌ను నిర్లక్ష్యం చేసిందన్నారు. 🌾 ఆర్థికంగా సహాయం చేయక పోవడంతో రూ. 56 వేల కోట్లు అప్పుల్లో సివిల్ సప్లై శాఖ ఉందన్నారు. ఇందులో 11వేల కోట్ల రూపాయల నష్టాల్లో సివిల్ సప్లై కార్పొరేషన్ ఉందని అన్నారు. 🍚 ప్రస్తుతానికి రూ. 18వేల కోట్ల విలువైన ధాన్యం రైస్ మిల్లర్ల వద్ద ఉందని, దీనిపై ఏం చేయాలనేది కేబినెట్‌లో చర్చిస్తామన్నారు. 🌐 మొత్తంగా 1.17లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సివిల్ సప్లై వద్ద ఉందనిని వెలుగులోకి వచ్చిందని మంత్రి తెలిపారు. 🌾

bottom of page