top of page

📢 కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తొలి ఉద్యోగం నీకే ఇస్తా.. 🙌

🤔 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి కాంగ్రెస్ దూకుడు పెంచింది. 🔥 ఆరు గ్యారెంటీల హామీలతో ప్రజల్లోకి దూసుకెళ్తోంది. 🗳️

ఈ తరుణంలో తెలంగాణ కాంగ్రెస్ అధినేత రేవంత్ రెడ్డి ఓ దివ్యాంగురాలికి హామీనిచ్చారు. 🤝 కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణమే తొలి ఉద్యోగం నీకే ఇస్తానంటూ హామీనిచ్చారు. 💼 అసలేం జరిగిందంటే.. హైదరాబాద్ నాంపల్లికి చెందిన దివ్యంగురాలు రజినీ అనే దివ్యాంగురాలు మంగళవారం రేవంత్ రెడ్డిని కలిసి తనకు ఉద్యోగం ఇప్పించాలంటూ కోరింది. 💪 ఆమె మాటలను విన్న రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తొలి ఉద్యోగం నీకే ఇస్తానంటూ హామీ ఇచ్చారు. 🌟 పీజీ పూర్తి చేసినా ఉద్యోగం రాలేదని.. రజనీ గాంధీ భవన్ కు చేరుకుని రేవంత్ రెడ్డిని కలిసింది. 🏢 ప్రభుత్వ ఉద్యోగం లేదని.. తన కు ప్రైవేట్ సంస్థల్లో కూడా ఉద్యోగం ఇవ్వడం లేదని తన ఆవేదనను రేవంత్ కు చెప్పింది.. 🔐 ఆమె బాధ విన్న తరువాత రేవంత్ రజనీకి భరోసా ఇచ్చారు. 🤞 డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం ఉంటుందని.. 📅 సోనియా రాహుల్, మల్లికార్జున ఖర్గే వస్తారు.. 🤗 అదే రోజు కాంగ్రెస్ పార్టీ నీకు ఉద్యోగం ఇస్తుందని హామీ ఇచ్చారు. 🌆 ఇది నా గ్యారంటీ అని హామీ ఇచ్చిన రేవంత్.. స్వయంగా కాంగ్రెస్ గ్యారంటీ కార్డును రజినీ పేరుతో నింపి ఇచ్చారు. 🎉 ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు.. 📷 ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 🌐

コメント


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page