top of page

రామోజీ ఫిలింసిటీకి వచ్చినప్పుడల్లా మనోబాల చేసే పని తెలిస్తే షాకవ్వక తప్పదు.!

దివంగత కమెడియన్, డైరెక్టర్, నిర్మాత అయిన మనోబాల మరణానికి తమిళ సినీ పరిశ్రమ అంతా విషాదంలో మునిగిపోయింది, తాజాగా ఆయన గొప్పతనం గురించి నటుడు జోష్ రవి బయట పెట్టారు. ఆ వివరాలు

Manobala Greatness Revealed by Actor Josh Ravi : ప్రముఖ తమిళ కమెడియన్, డైరెక్టర్, నిర్మాత అయిన మనోబాల చెన్నైలో ఈరోజు కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన వయసు 69 సంవత్సరాలు. గత రెండు వారాలుగా లివర్ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నై అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈరోజు ఆయన అనారోగ్య పరిస్థితి విషమించి కన్నుమూయడంతో తమిళ సినీ పరిశ్రమ అంతా ఒక్కసారిగా శోక సంద్రంలో మునిగి పోయినట్లు అయింది.

35 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఆయన 700 పైగా సినిమాల్లో నటించినట్లు తెలుస్తోంది. మనోబాలకు భార్య ఉష కుమారుడు, హరీష్ ఉన్నారు. 1979వ సంవత్సరంలో భారతీరాజా దర్శకత్వంలోని సినిమాతో ఆయన తన కెరీర్ ప్రారంభించారు. కమలహాసన్ స్నేహితుడిగా ఆయన భారతీరాజా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పని చేసినట్లు చెబుతున్నారు. ఇక చివరిగా ఆయన వాల్తేరు వీరయ్య అనే తెలుగు సినిమాలో నటించారు. ఆ తర్వాత కాజల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఘోష్టీ సినిమాలో కూడా నటించారు.ఇక కాలేయ వ్యాధితో బాధపడుతూ చెన్నైలో నివాసంలో మరణించిన మనోబాల కన్నుమూశారనే విషయం తెలుసుకుని అనేకమంది సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. మరీ ముఖ్యంగా రజనీకాంత్ అయితే తన మిత్రుడు, ప్రముఖ నటుడు దర్శకుడైన మనోభాల మరణ వార్త నన్ను ఎంతో భావించిందని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నానని పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని ప్రకటించారు. కమల్ హాసన్ కూడా మనోబాల మృతి తీవ్ర విషాదాన్ని నింపిందని ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

Comentarios


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page