top of page

📢 వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్.. 📹

📌 షార్ట్ వీడియో మెసేజెస్ ఫీచర్ వల్ల ఎదురవుతున్న సమస్యకు పరిష్కారంగా వాట్సాప్ ఓ బటన్ ను తీసుకొచ్చింది. 🔄📹

📲 మనకు అవసరం లేనప్పుడు ఈ వీడియో మెసేజ్ ఆప్షన్ ను పూర్తిగా డిసేబుల్ చేసుకొనే వెసులుబాటు కల్పించింది. 🔕🎥🛠️ వాట్సాప్ చాట్ సెట్టింగ్స్ మెనూలోకి ఈ కొత్త టోగుల్ ఫీచర్ ను అందించింది. 📄🔧

🔇 దీనిని డిసేబుల్ చేసుకుంటే వాయిస్ రికార్డర్ పై నొక్కితే కేవలం వాయిస్ మాత్రమే రికార్డు అవుతుంది. 🔊🎙️📳 ఎట్టి పరిస్థితుల్లోనూ వీడియో మోడ్ కు మారదు. 🚫📹

🤷‍♂️ అందరికీ కాదు.. 📢 వాట్సాప్ ఈ ఫీచర్ ను అందరికీ వినియోగంలోకి తేలేదు. కొంతమంది బీటా వెర్షన్లకు మాత్రమే ఈ వాట్సాప్ కొత్త టోగుల్ ఫీచర్ అందుబాటులో ఉంది. 📱✨

🤖 ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి, ఐఓఎస్ యూజర్లు టెస్ట్ ఫ్లైట్ యాప్ నుంచి ఈ బీటా వెర్షన్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. 📲🔄

🕒 త్వరలో అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకూ ఈ షార్ట్ వీడియో మెసేజ్ ఆప్షన్ ఎప్పుడూ ఆన్ లోనే ఉండేది. 🕰️🎥

🙌 కానీ ఇప్పుడు ఆన్/ఆఫ్ చేసుకొనే వెసులుబాటును వాట్సాప్ వినియోగదారులకు కల్పించింది.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page