top of page
MediaFx

వాట్సాప్ కీలక నిర్ణయం.. ఏకంగా 2 కోట్ల ఖాతాలపై వేటు🚫


ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ యూజర్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. కోట్లాది మంది వాట్సాప్ ద్వారా సందేశాలు చేరవేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాపులర్‌ మెసేజింగ్ అప్లికేషన్‌ వాట్సాప్ కొన్ని అభ్యంతర ఖాతాలను నిషేధించే పని పెట్టుకుంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది తొలి 3 నెలల్లోనే భారత్‌లో 2.2 కోట్ల ఖాతాలను వాట్సాప్ నిషేధించింది వాట్సాప్.

గతేడాది ఇదే కాలానితో పోలిస్తే ఇది రెట్టింపు కావడం గమనార్హం. వాట్సాప్ నెలవారీ నివేదికల్లో ఈ విషయాన్ని వెల్లడించింది. భారత చట్టాలను అతిక్రమించిన ఖాతాలు, గ్రీవెన్స్ కమిటీ సూచించినవి, వినియోగదారులు ఫిర్యాదు చేసినవి వీటిలో ఉన్నాయని తెలిపింది. తమ మార్గదర్శకాలకు, దేశ చట్టాలకు లోబడి ఉండని ఖాతాలను ఇలాగే తొలగిస్తామని స్పష్టం చేసింది వాట్సాప్ సంస్థ. 

జనవరి 1 - జనవరి 31, 2024 మధ్య డేటా ప్రకారం 6,728,000 WhatsApp ఖాతాలు నిషేధించబడ్డాయి. ఫిబ్రవరి 1 - ఫిబ్రవరి 29, 2024 మధ్య 7,628,000 ఖాతాలు నిషేధించబడినందున, ఫిబ్రవరిలో గణాంకాలు పెరిగాయి. మార్చిలో మరింత పెరుగుదల కనిపించింది. మార్చి 1 - మార్చి 31, 2024 మధ్య 7,954,000 ఖాతాలు నిషేధించబడ్డాయి. మొత్తంగా ఈ 3 నెలల్లోనే 2 కోట్ల ఖాతాలపై వేటు పడింది. 

యూజర్లకు ప్రైవసీ ఇంప్రూవ్ చేయడంపై ఎక్కువ ఫోకస్‌ చేస్తోంది వాట్సాప్. అలానే మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌ను సేఫ్‌గా ఉంచడానికి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా వాట్సాప్ నిబంధనలు ఉల్లంఘించే అకౌంట్స్‌ను బ్యాన్ (Ban) చేస్తుంటుంది. సాధారణంగా రూల్స్ వయోలేట్ (WhatsApp rules violation) చేసే అకౌంట్ల విషయంలో వాట్సాప్ చాలా కఠినంగా ఉంటుంది. వీటిని పర్మనెంట్‌గా బ్యాన్ చేస్తుంటుంది.


bottom of page