top of page

వాట్సాప్​ పర్సనల్​ చాట్​కు 'లాక్​'. కొత్త ఫీచర్​ వాడడం ఇలా..!


సాధారణంగా చాలా మంది వాట్సాప్​లో కొన్ని పర్సనల్ చాట్స్​ను హైడ్ చెయ్యడానికి మొత్తం యాప్​కే లాక్ వేస్తారు. అయితే ఇక నుంచి ఆ అవసరం లేదు. ఎందుకంటే సెలెక్టెడ్ చాట్స్​కు మాత్రమే లాక్ వేసుకునే ఫీచర్​ త్వరలోనే అందుబాటులోకి రానుంది!


చాట్ లాక్ను ఎలా ఎనేబుల్ చెయ్యాలి?

ముందుగా బీటా యూజర్లు వాట్సాప్ ను అప్డేట్ చేసుకోవాలి. లాక్ చేయాలనుకున్న వారి అకౌంట్ ఓపెన్ చేసి ప్రొఫైల్ సెక్షన్లోకి వెళ్లాలి. స్క్రోల్ చేస్తే అక్కడ 'చాట్ లాక్' అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే 'లాక్ దిస్ చాట్ విత్ ఫింగర్ ప్రింట్' అని వస్తుంది. దాన్ని ఎనేబుల్ చేసుకోవాలి.


బీటా వెర్షన్ను ఎలా పొందాలి?

బీటా వెర్షన్ కావాలనుకునే వినియోగదారులు.. ముందుగా వారి ఫోన్లలో గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్ను ఓపెన్ చెయ్యాలి. తర్వాత వాట్సాప్ అని టైప్ చేయాలి. అనంతరం దానిపై క్లిక్ చేసి కిందకు స్క్రోల్ చేస్తే డెవలపర్ సమాచారం వస్తుంది. అక్కడ బీటా ప్రోగ్రాం అనే ఆప్షన్ ఉంటుంది. అది ఫుల్ అని చూపిస్తే మీరు బీటా వెర్షన్ను ఉపయోగించలేరు. సాధారణంగా ఇది ఎప్పటికీ ఫుల్ గానే ఉంటుంది. అందువల్ల కొత్త వాళ్లు ఆ సౌకర్యాన్ని సులువుగా పొందలేరు.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page