🛫 ఎన్నో కొత్త ఫీచర్లతో ఎప్పటికప్పుడు యూజర్లను ఆకట్టుకునే వాట్సాప్‌లో మనకు తెలియని ఎన్నో ఆసక్తికరమైన ట్రిక్స్ ఉన్నాయని మీకు తెలుసా.? 🤔 ఇలాంటి ఆసక్తికరమైన ట్రిక్స్‌లో ఒకదాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 🎩
📌 సాధారణంగా వాట్సాప్‌లో వచ్చిన మెసేజ్‌ను చూస్తే వెంటనే అవతలి వ్యక్తికి మనం మెసేజ్ చూసినట్లు తెలుపుతూ బ్లూ టిక్స్ వస్తాయి. 🔵 అయితే అలా బ్లూ టిక్స్ రాకుండా ఉండాలంటే 'రీడ్ రిసిపింట్స్'ను ఆఫ్ చేసుకుంటే సరిపోతుందని తెలిసిందే. 📘
🔍 ఇలా చేస్తే మీ స్టేటస్ ఎవరు చూశారో తెలియదు, అలాగే మీరు మెసేజ్ చేసినట్లు ఎదుటి వ్యక్తులు చూశారో కూడా తెలియదు. అందుకే ఒక ట్రిక్ అందుబాటులో ఉంది. 🕵️♂️
🛫 ఇందుకోసం ముందుగా మీకు వాట్సాప్‌లో మెసేజ్ రాగానే ఓపెన్ చేసేకంటే ముందే, ఫ్లైట్ మోడ్ ఆన్ చేయాలి. ✈️ అనంతరం మెసేజ్‌ను ఓపెన్ చేసి చదివి, సదరు మెసేజ్ విండో నుంచి బయటకు రావాలి. అనంతరం ఫ్లైట్ మోడ్ తీసేస్తే సరిపోతుంది. మీరు మెసేజ్ చదివినట్లు ఎదుటి వ్యక్తికి తెలియదు. ✈️🚀