top of page
MediaFx

చిక్కుల్లో కంగన.. ఇప్పుడు ఎంపీ గారి పరిస్థితేంటి మరి ?


వివాదాలతో.. ఫిల్టర్ లేని మాటలతో ఎప్పుడూ నెట్టింట హాట్ టాపిక్ అయ్యే కంగనకు తాజాగా కోర్టు నుంచి నోటీసులు అందాయి. మండీ ప్రజల మనసు గెలుచుకుని ఎంపీ అయ్యారు. ఇక పార్లమెంట్‌లో తన గళాన్ని చాలా గట్టిగా వినిపించడానికి రెడీ అవుతున్న కంగనకు.. కోర్టు నోటీసులు వచ్చాయి. ఇప్పుడు త్రూ అవుట్ ఇండియా ఇదే అవుతోంది.. హాట్ టాపిక్ . ఇక అసలు విషయంలోకి వెళితే..! మండి లోక్‌ సభ నియోజవర్గం నుంచి బీజేపీ తరుపున పోటీ చేసిన కంగన.. తన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి.. విక్రమాదిత్య పై 74,755 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అయితే ఇదే ఎన్నికల బరిలో.. మరో అభ్యర్థి లాయక్ రామ్ నేగి కూడా.. పోటీ చేయాల్సింది. కానీ నేగి అంతకు ముందు ప్రభుత్వ ఉద్యోగిగా పదవీ విరమణ చేయడంతో.. అందుకు సంబంధించిన నో డ్యూ పత్రాలను రిటర్నింగ్ అధికారికి ఇవ్వాల్సి వచ్చింది. కానీ అక్కడే .. ఆ పత్రాల విషయంగానే.. అసలు వివాదం మొదలైంది. తాను నామినేషన్ గడువులోగా సరైన పత్రాలు ఇచ్చినప్పటికీ.. రిటర్నింగ్ అధికారి సరైన పత్రాలు లేవనే కారణంతో తన నామినేషన్‌ను తిరస్కరించారని.. తాజాగా కోర్టు మెట్లెక్కారు నేగి. అయితే తన ఫిర్యాదులో.. ఎన్నికల రిటర్నింగ్ అధికారితో పాటు కంగన పేరును కూడా జత చేశారు. దీంతో.. ఈ కేసును జూలై 24న విచారించిన హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు.. కంగన తో పాటు రిటర్నింగ్ అధికారికీ నోటీసులు జారీ చేసింది. దీంతో కంగన కోర్టు మెట్లెక్కాల్సిన పరిస్థితి వచ్చింది.

bottom of page