top of page
Shiva YT

🏏 ఇషాన్, అయ్యర్ విషయంలో అసలేం జరిగిందంటే? 🤔

🇮🇳 టీమిండియా యువ వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందు జట్టు నుంచి తన పేరును ఉపసంహరించుకుని స్వదేశానికి తిరిగి వచ్చాడు. అప్పటి నుంచి అతను టీమ్ ఇండియాలో కనిపించలేదు.

కానీ, కిషన్ ఆఫ్రికా టూర్ నుంచి వైదొలిగిన తర్వాత, జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ కిషన్‌కు దేశవాళీ క్రికెట్ ఆడమని సలహా ఇచ్చాడు. కానీ, ఇషాన్ రంజీ ఆడేందుకు వెనుకాడాడు. అతనితో పాటు, ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో రెండవ మ్యాచ్ తర్వాత అయ్యర్ కూడా జట్టు నుంచి తొలగించబడ్డాడు. ఆ సమయంలో భారత జట్టులో లేని ఆటగాళ్లను రంజీ ట్రోఫీ ఆడాలని బోర్డు కార్యదర్శి జై షా ఆదేశించారు. అయితే, ఇద్దరు ఆటగాళ్లు రంజీ ఆడేందుకు వెనుకాడారు. దీంతో అసంతృప్తికి గురైన బీసీసీఐ ఈ ఇద్దరిని సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించింది. 🚫

🗣️ ద్రవిడ్ ఏం చెప్పాడంటే? 🤨 🏆 ధర్మశాల టెస్ట్ విజయం తర్వాత కోచ్ రాహుల్ ద్రవిడ్‌ను విలేకరుల సమావేశంలో ఈ ఇద్దరు ఆటగాళ్ల గురించి ప్రశ్నలు అడిగారు. ఇద్దరు ఆటగాళ్లు ఇప్పటికీ టీమ్ ఇండియా ప్రణాళికల్లో భాగమేనని ద్రవిడ్ సమాధానమిచ్చాడు. జట్టు ప్రణాళికలో తాను ఎప్పుడూ భాగమేనని, దేశవాళీ క్రికెట్‌లో ఆడే వారు ఎప్పుడూ జట్టులో భాగమేనని చెప్పుకొచ్చాడు. ఈ ఇద్దరు ఆటగాళ్లను సెంట్రల్ కాంట్రాక్ నుంచి తప్పించడంలో తన పాత్ర లేదంటూ ద్రవిడ్ ప్రకటించాడు. 🤝

bottom of page