top of page
MediaFx

మనిషి చనిపోయే క్షణంలో మెదడులో ఏం జరుగుతుంది ?


మనిషి బతికున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుస్తుంది. చనిపోయాక ఏం జరుగుతుందో.. ఆధ్యాత్మికవాదులు చెబుతారు. కానీ చనిపోయే క్షణంలో మనిషి మెదడులో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయి? దీనికి సంబంధించి న్యూరో సైంటిస్టులు ఏం తెలుసుకున్నారు? అసలు ఈ విషయంలో ఇప్పటివరకు ఏమైనా పరిశోధనలు జరిగాయా? ఓ వ్యక్తి చిట్టచివరి క్షణాల్లో వారి మైండ్ ఎలా రెస్పాండ్ అవుతుంది? కొన్నాళ్ల కిందటి వరకు ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలు. కానీ వైద్యరంగం అభివృద్ధి చెందుతున్న వేళ.. శాస్త్రవేత్తల పరిశోధనలు ఫలిస్తున్న వేళ.. వీటన్నింటికీ నెమ్మదిగా జవాబు దొరికే ఛాన్స్ పెరుగుతోంది. కొన్ని ప్రశ్నలకు సమాధానం రావడానికి లేటయ్యే అవకాశం ఉన్నా.. మరికొన్నింటి చిక్కుముడి ఇప్పుడిప్పుడే వీడుతోంది. కొందరు సైంటిస్టులు.. దాదాపు పదేళ్ల కిందట ఎలుకలపై పరిశోధన చేస్తున్నప్పుడు వాటి న్యూరో కెమికల్ ప్రాసెస్ ను గమనించారు. ఆ సమయంలో అవి చనిపోయాయి. అనుకోకుండా.. ఆ సమయంలో వాటి మైండ్ లో జరిగే మార్పులను గమనించడానికి శాస్త్రవేత్తలకు వీలు చిక్కింది. అప్పుడు ఓ ఎలుకలో సెరోటోనిన్ రసాయనం ఎక్కువగా విడుదల కావడాన్ని గమనించారు. సెరోటోనిన్ అనేది.. ఫీలింగ్స్ ను కంట్రోల్ చేస్తుంది. ప్రవర్తన, మూడ్, జ్ఞాపకశక్తి, నేర్చుకోవడం, సంతోషం, శరీర ఉష్ణోగ్రత, నిద్ర, ఆకలి.. ఇలాంటివాటిని రెగ్యులేట్ చేస్తుంది. ఒకవేళ దీని మోతాదు తగ్గితే.. డిప్రెషన్, యాంగ్జయిటీ.. ఇలా కొన్ని ఆరోగ్య సమస్యలు తప్పవు. అందుకే సెరోటోనిన్ ను ఫీల్ గుడ్ హార్మోన్ అని పిలుస్తారు. ఆ ఎలుకలో సెరోటోనిన్ అంతగా ఎందుకు రిలీజ్ అయ్యింది అన్న ప్రశ్న.. ఓ మంచి పరిశోధనకు దారితీసింది. మనిషి చనిపోతున్నప్పుడు తన మెదడులో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయోగాన్ని కూడా కొనసాగించారు.

bottom of page