top of page

ప్రొటీన్లు కావాలా ⁉️😲


మంకు ఎముకలు ధృడంగా ఉండాలి అంటే ప్రొటీన్ల ఎంతో ముఖ్యం బలంగా ,ఆరోగ్యాంగా ఉండేందుకు ప్రోటీన్లు ఎంతో సహాయపడుతాయి . కావున ప్రొటీన్లు.. కేవలం మాంసాహారంలోనే కాదు.. కొన్ని రకాల శాకాహార పదార్థాలలోనూ అధికంగానే లభిస్తాయి.మరి అవేంటో చూద్దాం రండి.


1.Quinoa

ప్రొటీన్ల లోపంతో బాధపడే వారికి క్వినోవా మంచి ఆహారం వీటిలోని అన్‌శ్యాచురేటెడ్‌ కొవ్వులు, క్యాల్షియం, మాంగనీస్‌, పొటాషియం, ఫాస్ఫరస్, కాపర్‌, జింక్‌, బి6, ఇ, నియాసిన్, థయమిన్.. వంటి విటమిన్లు, పోషకాలు శరీరానికి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తాయి పీచు పదార్థాలు అధికంగా ఉండే క్వినోవా బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఆహారం.




2.Oats

ప్రొటీన్లే కాదు అన్ని రకాల పోషకాలు పుష్కలంగా ఉండే ఓట్స్‌ను ‘సూపర్‌ఫుడ్’ అని పిలుస్తారు. ఇందులో కార్బొహైడ్రేట్లు, పీచుపదార్థాలు, మాంగనీస్, ఫాస్ఫరస్, కాపర్, ఐరన్‌, సెలీనియం, మెగ్నీషియం, జింక్‌ లాంటి మినరల్స్‌ కూడా అధికంగా ఉంటాయి. పాలు, తేనె, బాదం పాలతో కలిపి ఓట్స్‌ను తీసుకుంటే శరీరానికి మరిన్ని పోషకాలు అందుతాయి.


3. Fruits And Vegetables


సాధారణంగా కూరగాయలు, పండ్లలో ప్రొటీన్ల శాతం తక్కువగా ఉంటుంది. అయితే బచ్చలి కూర, తోటకూర, బంగాళా దుంపలు, బ్రకలి.. మొదలైన వాటిలో మాత్రం ప్రొటీన్లు పుష్కలంగా లభ్యమవుతాయి. అదేవిధంగా అరటి, జామ, కొన్ని రకాల బెర్రీ పండ్లలో కూడా ప్రొటీన్లు సమృద్ధిగానే ఉంటాయి.



4. Sabja

బరువు తగ్గించుకుని రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలనుకునే వారికి సబ్జా గింజలు మంచి ఆహారమని చెప్పుకోవచ్చు. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ప్రొటీన్‌తో పాటు ఫైబర్ ఉంటుంది. గ్లూటెన్‌ ఉండదు. ఈ గింజల్లో ఫైబర్‌ మోతాదు ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది.


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page