ఇస్రో (ISRO -భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ) మరోసారి ప్రయోగాన్ని విజయవంతం చూసింది. ఆగస్టు 16న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఎస్‌ఎస్‌ఎల్‌వి-డి3 రాకెట్‌ను ప్రయోగించిన విషయం తెలిసిందే. SSLV-D3 రాకెట్‌లోని EOS-8 ఉపగ్రహం కొత్త, భవిష్యత్తు సాంకేతికతలతో నిండి ఉందని.. ఇది ఇస్రో, భారతదేశ ప్రజల కలలకు శక్తినిస్తుందని నిపుణులు చెబుతున్నారు. SSLV-D3-EOS-08 రాకెట్ భూమిని పర్యవేక్షించేందుకు రూపొందించిన ఉపగ్రహాన్ని నింగిలోకి పంపించారు. ఈ ఉపగ్రహంలో మూడు పేలోడ్‌లు ఇన్‌స్టాల్ చేసింది ఇస్రో. ఈ ఉపగ్రహాలు భూమికి 475 కిలోమీటర్ల ఎత్తులో వృత్తాకార కక్ష్యలో తిరుగుతాయి. ఉపగ్రహ లక్షణాలు:
ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (EOS-08) అనేది భూమిని పర్యవేక్షించే ఉపగ్రహం. అలాగే ఏదైనా విపత్తు గురించి ముందస్తు హెచ్చరికను కూడా అందిస్తుంది.
ఇది ఏదైనా విపత్తును ఎదుర్కోవడంలో సహాయపడుతుంది.
ఈ ఉపగ్రహం బరువు దాదాపు 175.5 కిలోలు.
ఇందులో మూడు పేలోడ్‌లు ఉన్నాయి. ఒకటి ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్‌ఫ్రారెడ్ పేలోడ్ (EOIR), రెండవది గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్-రిఫ్లెక్టోమెట్రీ పేలోడ్ (GNSS-R), మూడవది SIC UV డోసిమీటర్.
దీని పొడవు సుమారు 34 మీటర్లు.
ఈ ఉపగ్రహాన్ని, స్పేస్ కిడ్జ్ ఇండియా అభివృద్ధి చేసిన 0.2 కిలోల SR-0 డెమోసాట్‌ను 475 కిమీ వృత్తాకార కక్ష్యలో భూమధ్యరేఖకు 37.4 డిగ్రీల వంపుతో, లిఫ్ట్-ఆఫ్ అయిన 17 నిమిషాల తర్వాత ఉంచింది.
అలాగే ఈ ఉపగ్రహంలోని పేలోడ్ భవిష్యత్తులో మానవ సహిత మిషన్ గగన్‌యాన్ కోసం UV రేడియేషన్‌ను పర్యవేక్షిస్తుంది. గామా రేడియేషన్ కోసం అధిక అలారం సెన్సార్‌గా పనిచేస్తుంది.
ఈ ఉపగ్రహం ఫోటోలు 24 గంటలూ క్యాప్చర్ చేయడానికి రూపొందించబడింది.
మరో ఉపగ్రహం సముద్రాలు, పర్వతాలు, మంచు కవచం, అడవులు వంటి భూమి లక్షణాలను విశ్లేషిస్తుంది.
మరో ఉపగ్రహం అంతరిక్షంలో అతినీలలోహిత వికిరణాన్ని కొలవడానికి రూపొందించబడింది.
ఈ ఉపగ్రహం సహాయంతో పర్యావరణ పర్యవేక్షణ, విపత్తు నిర్వహణ, భూకంపం, సునామీ వంటి ప్రకృతి వైపరీత్యాలను గుర్తించడం వంటివి చేయవచ్చు.
భారతదేశానికే కాకుండా ప్రపంచం మొత్తానికి కూడా ముఖ్యమైన సమాచారాన్ని అందించడానికి ఇది పని చేస్తుంది.
దీనిలో ఇన్‌స్టాల్ చేయబడిన EOIR పగలు, రాత్రి సమయంలో ఏర్పడే తరంగాల గురించి ఫోటోలను పంపిస్తుంది.
ఈ ఉపగ్రహ సముద్ర ఉపరితల గాలి, నేల తేమను తనిఖీ చేయడానికి, వరదలను గుర్తించడానికి రిమోట్ సెన్సింగ్ సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంది.