top of page

👉 మహారాష్ట్రలో గెలిపిస్తే..కేంద్రం మెడలు వంచుతాం..కేసీఆర్ 🏆

👉 బీఆర్ఎస్‌ పేరుతో జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెంచిన గులాబీ దళపతి కేసీఆర్.. ముందుగా పొరుగు రాష్ట్రమై మహారాష్ట్రపై గురిపెట్టారు. మహారాష్ట్రలో పట్టు సాధిస్తే.. దేశ వ్యాప్తంగా విస్తరించొచ్చని భావిస్తున్నారు కేసీఆర్.

ఈ నేపథ్యంలోనే.. ఆ రాష్ట్రంలోని కీలక నేతలను బీఆర్ఎస్‌లో చేర్చుకుంటున్నారు. తాజాగా మహారాష్ట్రలోని సోలాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు సర్పంచ్‌లు సోమవారం తెలంగాణ‌ భవన్ వేదికగా బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మహారాష్ట్రలో పార్టీని గెలిపించేందుకు కృషి చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు కేసీఆర్. 💪👨‍🌾👉 దేశాన్ని అంబానీ, అదానీలకు దోచిపెడుతున్నారంటూ ఎన్డీయే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు సీఎం కేసీఆర్. దేశంలో ఉన్న వనరులన్నింటినీ ఆ ఇద్దరికీ కట్టబెడుతున్నారని ఆరోపించారు. దేశంలో విస్తారమైన బొగ్గు నిల్వలు ఉన్నప్పటికీ.. ఆస్ట్రేలియా, ఇండోనేషియా నుంచి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. బొగ్గు నిల్వలను అదానీ, అంబానీలకు అప్పగించి, తద్వారా విద్యుత్ బిల్లులు పెంచి, పేదలను దోచుకోవడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న వికృత చేష్టలివి అని ఫైర్ అయ్యారు. 🔥🧐

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page