ఈ రోజుల్లో అధిక బరువు కారణంగా చాలామంది బాధపడుతున్నారు. మీరు త్వరగా బరువు తగ్గడానికి కొన్ని ఎఫెక్టివ్ వ్యాయామాలు సహాయపడతాయి. అవేంటో చూద్దాం.
స్ప్రింటింగ్..
స్ప్రింటింగ్ అంటే.. తక్కువ దూరాన్ని మ్యాక్సిమమ్ స్పూడ్‌తో తక్కువ సమయంలో పరిగెత్తడం. స్ప్రింటింగ్ కూడా ఏయిరోబిక్ వ్యాయామం. స్ప్రెంటింగ్ చేసేప్పుడు అథ్లెట్స్ సాధారణ వేగం కంటే.. స్పూడ్‌గా పరిగెడతారు. ఇది ఆక్సిజన్ లెస్ ఎక్స్‌అర్‌సైజ్. ఇది హై-ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ (HIIT) ఎక్స్‌అర్‌సైజ్. HIIT ఎక్స్‌ర్‌సైజ్ హృదయ స్పందన రేటును పెంచుతుంది. ఇది పని చేయడం మానేసిన తర్వాత కూడా శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది. స్ప్రింటింగ్.. శరీర జీవక్రియను మెరుగుపరుస్తుంది, తద్వారా బరువు కంట్రోల్‌లో ఉంటుంది.
బార్బెల్ బ్యాక్ స్క్వాట్స్..
బార్బెల్ బ్యాక్ స్క్వాట్స్.. శరీరంలోని అనేక కండరాల సమూహాలను కదిలిస్తుంది. ఇది కేలరీలు బర్న్ అయ్యే రేటును పెంచుతుంది, కండర ద్రవ్యరాశి పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. బార్‌బెల్ బ్యాక్ స్క్వాట్‌లు ముఖ్యంగా శరీర కొవ్వు శాతాన్ని తగ్గించడానికి తోడ్పడుతుంది.
HIIT..🏃♂️
హై-ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ (HIIT). మీరు వేగంగా బరువు తగ్గాలనుకుంటే.. మీ వర్క్‌అవుట్ రొటీన్‌లో హై-ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ యాడ్ చేసుకోండి. ఇది సాధారణ కార్డియో వ్యాయమం కంటే.. త్వరగా కొవ్వు, కేలరీలను బర్న్ చేస్తుంది. హై-ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ ఇన్సులిన్ సెన్సిటివిటీ, కార్డియోవాస్కులర్ ఫిట్‌నెస్‌ను మెరుగుపరుస్తుంది, అదే సమయంలో కొవ్వు కరిగించడానికి తోడ్పడుతుంది.
స్విమ్మింగ్..🏊♀️
మీరు బరువు తగ్గాలనుకుంటే.. స్విమ్మింగ్ ప్రభావవంతమైన వ్యాయామం. ఇది మీ శరీరంలోని ప్రతి కండరాల సమూహాన్ని, ముఖ్యంగా చేతులు, కాళ్లు, కోర్ భాగాలలో కండరాలను కదిలిస్తుంది. స్విమ్మింగ్ కండరాలను నిర్మించడానికి, కేలరీలను బర్న్ చేయడానికి తోడ్పడుతుంది. ఈ వ్యాయామం మీ శరీరాన్ని టోన్ చేస్తుంది, ఫ్లెక్సిబిలిటీని మెరుగుపరుస్తుంది. స్విమ్మింగ్ మీరు త్వరగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
యోగా..🧘♀️
మీ బరువును త్వరగా తగ్గించడానికి.. యోగా కూడా ఎఫెక్టివ్‌గా సహాయపడుతుంది. యోగా మీ శరీరం, దాని ఆకలి సూచనల గురించి మరింత తెలుసుకోవడానికి తోడ్పడుతుంది. ఊర్ధ్వ ఆసనం, పాద హస్తాసనం, మార్జాలాసనం, భుజంగాసనం, పర్వతాసనం, అశ్వ సంచలనాసనం వంటి యోగాసనాలు.. రోజూ ప్రాక్టిస్ చేస్తే, మీరు త్వరగా బరువు తగ్గుతారు.🏋️♂️🏃♂️