🌡️🌍🔥 గ్లోబల్ వార్మింగ్.. 🌊🌍🔄 వాతావరణ మార్పులు.. భూగోళంపై ఇది కేవలం ఏ ఒక్క ప్రాంతానికో పరిమితమైన అంశం కాదు. 🌍🔭
యావత్ ప్రపంచమే వాతావరణ మార్పుల ప్రభావాన్ని చూస్తోంది. గత వేసవిలో ఎన్నడూ లేని అధిక ఉష్ణోగ్రతలను ఐరోపా ఖండం చవి చూసింది. 🌨️❄️ హిమానీ నదాలతో పాటు కిలోమీటర్ల మందం మంచుతో పేరుకుని ఉంటే ఉత్తర, దక్షిణ ధృవాలు సైతం కరిగిపోతున్నాయి. భరించలేని వడగాల్పులు (వేడి గాలులు) పెరిగిపోయాయి. 🌬️🌀 ఆ వెంటనే ఊహించని ఉత్పాతాన్ని సృష్టించే భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ☔🌧️ ముఖ్యంగా భారత ఉపఖండంపై ఈ వాతావరణ మార్పులు యావత్ దేశ ఆర్థిక వ్యవస్థనే అతలాకుతలం చేస్తున్నాయి. 🌱🌏 ఈ ఏడాది జులైలో దేశంలోని చాలా ప్రాంతాల్లో సగటు కంటే అధిక వర్షపాతం నమోదైతే, కొన్ని ప్రాంతాల్లో చుక్క నీరు దిక్కులేదు. ☂️🌧️