ఏ రిలేషన్‌లో అయినా చిన్న చిన్న తగాదాలు రావడం కామన్. నిజానికీ ప్రేమ ఉన్న చోట కోపం కూడా కామన్ అని చెబుతారు. కానీ, ఆ కోపంలో కొన్నిసార్లు చేయకూడని తప్పులు చేసి చాలా నష్టపోతారు. అలా కాకుండా ఆ రిలేషన్‌లోని ఇద్దరిలో ఒక్కరైనా కొన్ని టిప్స్ ఫాలో అయితే ఆ సమస్యల్ని తగ్గించుకోవచ్చు. అవేంటో తెలుసుకోండి.
రిలేషన్‌లో గొడవలు అయినప్పుడు పరస్పరం దాడిచేసుకోవడం, కోపగించుకోవడం, వస్తువులని విసరిరేయడం వంటివి జరుగుతాయి. ఇది మనం కంట్రోల్ చేయలేని సిట్చ్యుయేషన్‌కి కారణమవుతుంది. ఇలాంటివాటికి చెక్ పెట్టాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి . ఫాలో అవ్వాల్సిన మొదటి విషయంలో కొట్టుకోవడం వంటివి చేయకూడదు. దీని వల్ల మనం చాలా ఇబ్బందులు పడతాం. అలా చేయకుండా ఉండాలి. గొడవపడినప్పుడు ఎదుటివారిని కోప్పడడం, వారి పేరెంట్స్‌ని తిట్టడం వంటివి చేయొద్దు. అదే విధంగా వస్తువులని విసిరిపారేయడం వంటివి కూడా చేయొద్దు. దీని వల్ల మీరే ఎక్కువగా నష్టపోతారు. కోపం వచ్చినప్పుడు ఏదైనా బుక్ తీసుకోండి. మీరు అందులో మీకు అనిపించిన ఆలోచనలన్నీ అందులో రాయండి. డీప్ బ్రీథ్ తీసుకోండి. దీని వల్ల మీరు మీ కోపాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతారు. ఎందుకు గొడవపడ్డారో ఆలోచించండి. దేని వల్ల బాధ కలిగిందో రాసుకోండి. ఎదుటివారి ఏ బిహేవియర్ ఇబ్బంది పెట్టిందో రాయండి. కాసేపు అలానే ఉండండి. దీని వల్ల చాలా వరకూ రిలాక్స్ అవుతారు. దీనినే రిఫ్లెక్షన్ టెక్నాలజీ అంటారు. బంధం అంటే బాధపెట్టే విషయాలే కాదు.. ఆనందకరమైన అంశాలు కూడా ఉంటాయి. వాటిని కూడా ఓ సైడ్ రాయండి. అది టూర్ కావొచ్చు. మంచి గిఫ్ట్ కావొచ్చు. ఏవైనా కూడా అలా రాయండి. ఇప్పుడు రెండింటిని కంపేర్ చేసి చూడండి. దీని వల్ల చాలా వరకూ మీరు కాస్తా రియలైజ్ అవుతారు. ఏదైనా విషయంలో మీ ఇద్దరి మధ్య గొడవ వచ్చినప్పుడు అది ఏ కారణం చేత వస్తుందో కనుక్కుని ఇద్దరు కూర్చుని దాని గురించి మాట్లాడండి. తర్వాత ఇద్దరు కూడా ఒకరినొకరు మగ్ చేసుకోండి. దీని వల్ల చాలా వరకూ కోపం తగ్గి గొడవలు కూడా తగ్గిపోతాయి.