top of page

వయనాడ్ బాధితులకు నయనతార విఘ్నేశ్, కమల్ హాసన్ విరాళం..


దేవతలు నడయాడే చోటుగా పేరున్న కేరళలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షాలు, వరదల కారణంగా వయనాడ్ లో కొండ చరియలు విరిగి పడడంతో సుమారు 330 మందికి పైగా మృత్యువాత పడ్డారు. వేలాది మంది గాయ పడ్డారు. ఇంకా శిథిలాల కింద చాలామంది చిక్కుకున్నారని అధికారులు చెబుతున్నారు. అలాగే వందలాది మంది ఆచూకీ తెలియరావడం లేదంటున్నారు. ఎప్పుడూ పర్యాటకులతో కిటకిటలాడే ఈ ప్రాంతం ఇప్పుడు మరు భూమిగా మారిపోయింది. ఈ ఘటన తో దేశం మొత్తం దిగ్భ్రాంతిలో కూరుకుపోయింది. ప్రధాని నరేంద్ర మోడీతో సహా పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు వయనాడ్ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మృతులు, బాధితుల కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకొస్తున్నారు. ముఖ్యంగా కేరళ ప్రజలను ఆదుకోవడంలో భాగంగా ఇప్పటికే చాలామంది సినీ సెలబ్రిటీలు భారీగా విరాళాలు ప్రకటించారు. తాజాగా నయనతార- విఘ్నేశ్ శివన్ దంపతులు కూడా వయనాడ్ బాధితుల కోసం తమ వంతు విరాళం ప్రకటించారు. కేరళకు జరిగిన నష్టాన్ని ఎవరూ భర్తి చేయలేరంటూ నయనతార భర్త విగ్నేష్‌ శివన్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం తమ వంతుగా రూ. 20 లక్షలు అందిస్తున్నట్లు అందులో వారు తెలిపారు. రూ. 25 లక్షలు అందజేసిన కమల్ హాసన్..

‘ కేరళ ప్రజల కష్టాలను చూస్తుంటే కన్నీటితో తమ గుండె బరువెక్కిపోతోంది. ఈ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటోన్న అందరికీ ధన్యవాదాలు. ఈ విపత్తు నుంచి కేరళ ప్రజలు తొందరగా బయట పడాలి’ అని నయన తార దంపతులు ఆకాంక్షించారు.వీరితో పాటు దిగ్గజ నటుడు కమల్ హాసన్ వయనాడ్ వరద బాధితులకు రూ. 25 లక్షలు ప్రకటించారు. ఈ మెుత్తాన్ని కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి అందిస్తున్నట్లు తెలిపారు. ఇక టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ తన మంచి మనస్సును చాటుకున్నాడు. తన నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్‌మెంట్, లక్కీ భాస్కర్ టీం తరుఫున వయనాడ్ బాధితులకు విరాళాన్ని ప్రకటించాడు. కేరళ ప్రభుత్వ విపత్తు సహాయ నిధికి 5 లక్షల రూపాయలు ఇస్తున్నట్లు తెలిపింది సితార ఎంటర్ టైన్‌మెంట్





Comments


bottom of page