top of page
Shiva YT

వాట్సాప్ నుంచి కిర్రాక్ అప్‌డేట్.. ఒకేసారి 32 మందితో వీడియో కాల్‌ మాట్లాడొచ్చు..

మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్, బెస్ట్ మెసేజింగ్‌ పోర్టల్‌గా పాపులర్ అయింది. అలాగే ఎన్నో రకాల సేవలను యూజర్లకు చేరువ చేస్తోంది.

ఇప్పటికే విండోస్‌ (Windows) యూజర్లకు వీడియో కాలింగ్‌ ఫీచర్‌ను పరిచయం చేసిన వాట్సాప్‌.. ఇప్పుడు ఏకంగా 32 మంది వ్యక్తులు ఒకేసారి వీడియో కాల్‌లో మాట్లాడేలా అప్‌డేట్‌ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ అద్భుతమైన ఫీచర్‌ కోసం యూజర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే కొంతమంది లక్కీ బీటా టెస్టర్లకు ఈ ఫీచర్‌ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది.వాట్సాప్‌ చాలా కాలంగా టెక్స్ట్ మెసేజింగ్, ఆడియో కాల్స్, స్మాల్‌ గ్రూప్ వీడియో కాల్స్ ద్వారా స్నేహితులు, కుటుంబం, సహోద్యోగులతో కనెక్ట్ అయ్యే ఫెసిలిటీస్ అందిస్తోంది. ఈ ఎక్స్‌పీరియన్స్ మెరుగు పరిచేందుకు డెస్క్‌టాప్ యాప్, వాట్సాప్ వెబ్, యాప్‌లో సరికొత్త అప్‌డేట్స్ రిలీజ్ చేస్తోంది. * లేటెస్ట్ అప్‌డేట్ తాజా ఫీచర్ గురించి వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ WABetainfo కీలక విషయాలు వెల్లడించింది. ‘గతంలో వాట్సాప్‌ గరిష్టంగా 8 మంది వ్యక్తులతో గ్రూప్ వీడియో కాల్స్, 32 మంది వ్యక్తులతో ఆడియో కాల్స్‌కు సపోర్ట్‌ చేసేది. అయితే కమ్యూనికేషన్‌ ఎక్స్‌పీరియన్స్‌ మెరుగుపరిచేందుకు భవిష్యత్తులో వాట్సాప్ ఈ పరిమితులను పెంచుతుందని పేర్కొన్నాం. మైక్రోసాఫ్ట్ స్టోర్‌లో అందుబాటులో ఉన్న Windows 2.2324.1.0 తాజా వాట్సాప్‌ బీటాతో, కొంతమంది బీటా టెస్టర్లు ఎక్కువ మందితో గ్రూప్‌ వీడియో కాల్స్ చేసుకోవచ్చు.’ అని WABetainfo పేర్కొంది.

WABetainfo షేర్‌ చేసిన స్క్రీన్‌షాట్ ప్రకారం.. గ్రూప్‌ కాల్ ప్రయత్నించమని ఆహ్వానిస్తూ కొంతమంది బీటా టెస్టర్‌లకు మెసేజ్‌ ప్రాంప్ట్ అవ్వవచ్చు. ప్రత్యేకంగా ఈ మెసేజ్‌ విండోస్‌ యాప్ నుంచి 32 మంది వ్యక్తులు, కాంటాక్ట్‌లు, గ్రూప్‌ మెంబర్స్‌కు వీడియో కాల్ చేయగల సామర్థ్యాన్ని సూచిస్తుంది.

ఇంతకుముందు, గరిష్టంగా 32 మంది వ్యక్తులతో ఆడియో కాల్‌ చేయగల సామర్థ్యం అందుబాటులో ఉంది. అయితే తాజా అప్‌డేట్‌తో కొంతమంది వినియోగదారులు ఇప్పుడు గరిష్టంగా 32 మంది వ్యక్తులతో వీడియో కాల్‌ కూడా మాట్లాడవచ్చు. గతంలో వాట్సాప్ విండోస్ 2.2322.1.0 బీటా అప్‌డేట్‌తో వచ్చిన ‘షేర్ స్క్రీన్ డ్యూరింగ్ వీడియో కాల్స్’ ఫెసిలిటీ కూడా లేటెస్ట్ అప్‌డేట్‌లో ఉంది.

మైక్రోసాఫ్ట్ స్టోర్ నుంచి వాట్సాప్ విండోస్ బీటా వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేసిన కొంతమంది బీటా టెస్టర్లు ఇప్పుడు గరిష్టంగా 32 మంది వ్యక్తులతో వీడియో కాల్స్ చేసే అవకాశాన్ని పొందుతారు. ఇంకా ఈ అప్‌డేట్‌ను అందుకోకుంటే, రాబోయే రోజుల్లో క్రమంగా ఈ ఫీచర్‌ అందరికీ అందుబాటులోకి రానుంది.

* మరో కొత్త ఫీచర్

వాట్సాప్ 'మెసేజ్ పిన్ డ్యూరేషన్‌' అనే కొత్త ఫీచర్‌ను డెవలప్‌ చేస్తోంది. దీని ద్వారా వినియోగదారులు పిన్‌ చేసిన మెసేజ్‌లకు స్పెసిఫిక్‌ టైమ్‌ ఫ్రేమ్‌ సెట్‌ చేయవచ్చు. రాబోయే ఈ ఫీచర్‌తో పిన్ చేసిన మెసేజ్‌లు కన్వర్జేషన్‌లో ఎంత కాలం యాక్టివ్‌గా ఉండాలనేది యూజర్‌ నిర్ణయించుకోవచ్చు. అందుబాటులో 24 గంటలు, 7 రోజులు లేదా 30 రోజులు వంటి ఆప్షన్‌లు ఉంటాయి. ప్రాధాన్యత ఆధారంగా యూజర్లు డ్యూరేషన్‌ మాడిఫై చేసుకోవచ్చు. మెసేజ్‌ను అన్‌పిన్ చేయాలనుకుంటే, డ్యూరేషన్‌ ముగిసేలోపు అన్‌పిన్ చేయవచ్చు.

bottom of page