top of page

🌊 తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ మొదలైన వాటర్ వార్... 🚰

తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ వాటర్ వార్ మొదలైంది. కృష్ణా నదిపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను KRMBకి అప్పగించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకుందన్న హరీష్ రావు వ్యాఖ్యలు పొలిటికల్‌ హీట్ పెంచాయి.

కేంద్రం నుంచి అలాంటి ప్రతిపాదన వచ్చిందని.. కానీ తాము అందుకు ఒప్పుకోలేదని తెలంగాణ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. దీనిపై అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు.

ప్రభుత్వం వివరణ ఇచ్చినా.. ఈ అంశంపై బీఆర్‌ మాత్రం తన వాదన వినిపిస్తూనే ఉంది. ఉమ్మడి ప్రాజెక్టులను KRMB నిర్వహిస్తే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి. కేంద్రం షరతులకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఒప్పుకున్నదని ఆయన ప్రశ్నించారు.

మరోవైపు ఈ వ్యవహారంలో బీఆర్‌ఎస్‌కు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. గతంలో కృష్ణా నదీ జలాలకు సంబంధించి జరిగిన ఒప్పందంపై కేసీఆర్‌ సంతకం చేశారని.. అప్పుడు హరీశ్‌రావు ఇరిగేషన్‌ మంత్రిగా ఉన్నారని బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. 🤔🔍

Commenti


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page