top of page
Suresh D

ఇదెక్కడి మాస్ రా మావా..! కుర్చీ మడతపెట్టి సాంగ్‌కు కేక స్టెప్పులేసిన అంపైర్✨🎵

చాలా మంది సినీ సెలబ్రెటీలు, సోషల్ మీడియా స్టార్స్ కుర్చీ మడత పెట్టి సాంగ్ కు స్టెప్పులేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. తాజాగా ఓ క్రికెట్ గ్రౌండ్ లో అంపైర్ ఇప్పుడు కుర్చీ మడత పెట్టి సాంగ్ హుక్ స్టెప్పేశాడు.

మహేష్ బాబు ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్న గుంటూరు కారం సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది. సంక్రాంతి కానుకగా భారీ అంచనాల మధ్య విడుదలైన గుంటూరు కారం సినిమా మంచి కలెక్షన్స్ ను సాధించింది. గుంటూరు కారం సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. ఆతర్వాత మెల్లగా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఈ సినిమా ఆకట్టుకుంది. మహేష్ బాబు మాస్ మసాలా అవతార్ లో కనిపించి మెప్పించాడు. సూపర్ స్టైలిష్ లుక్ తో పాటు డాన్స్ లతోనూ అదరగొట్టారు. ఇక ఈ సినిమాలోని కుర్చీ మడత పెట్టి సాంగ్ ఓ రేంజ్ లో ట్రెండ్ అయ్యింది. సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేసింది ఈ సాంగ్.

చాలా మంది సినీ సెలబ్రెటీలు, సోషల్ మీడియా స్టార్స్ కుర్చీ మడత పెట్టి సాంగ్ కు స్టెప్పులేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. తాజాగా ఓ క్రికెట్ గ్రౌండ్ లో అంపైర్ ఇప్పుడు కుర్చీ మడత పెట్టి సాంగ్ హుక్ స్టెప్పేశాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

గ్రౌండ్ లో బ్యాట్స్ మెన్ ఫోర్ కొట్టగానే అంపైర్ ఫోర్ సిగ్నల్ చూపించి ఒక్కసారిగా కుర్చీ మడత పెట్టి సాంగ్ స్టెప్పులేశాడు. ఈ వీడియో చాలా తమాషాగా ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మహేష్ ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు. నెటిజన్స్ ఈ వీడియో పై క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. గుంటూరు కారం సినిమా తర్వాత మహేష్ బాబు ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం మహేష్ నయా లుక్ ట్రై చేస్తున్నాడు. ఇందుకోసం మహేష్ బాబు బయట ఎక్కడ ఈవెంట్స్ లో కనిపించ వద్దు అని రాజమౌళి కండీషన్ పెట్టాడట.✨🎵


Comments


bottom of page